అమెరికా: నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అమెరికాలోని పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. లూసియానా రాష్ట్రంలో మిసిసిపీ నది పొంగి ప్రవహించడంతో న్యూ ఓర్లీన్స్ నగరం వరదల్లో చిక్కుకుంది. పలు ఇల్లు, వాహనాలు మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. స్థానిక ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించాయి.