AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP NRI : డల్లాస్‌లో పవన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ ఫైట్.. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత కేసీ చేకూరి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన సీనియర్ నాయకుడు కేసీ చేకూరి అరెస్ట్ అయ్యారు. డల్లాస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

TDP NRI : డల్లాస్‌లో పవన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ ఫైట్.. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నేత కేసీ చేకూరి అరెస్ట్
KC Chekuri
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2023 | 2:00 PM

Share

అమెరికాలోని డల్లాస్‌లో టీడీపీ నేత కేసీ చేకూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌ 31 రాత్రి టీడీపీ – జనసేన మధ్య జరిగిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది. పరస్పర దాడులతో కలకలం చెలరేగింది. ఇదే కేసులో చేకూరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు మొదటి కారల్టెన్ పోలీసు స్టేషన్ కి తరలించారు. ఆ తరువాత డల్లాస్‌ స్టేషన్‌కి మార్చారు.

తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన డిసెంబర్ 31 రాత్రి పార్టీలో టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నూతన సవంత్సరం వేడుకల్లో.. మ్యూజికల్ నైట్ పాటల సెలక్షన్‌లో.. బాలయ్య అభిమానులు , పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ NRI విభాగం ముఖ్యుడు కేసీ చేకూరి పవన్ అభిమానుల మీదకి దూసుకెళ్ళాడు. దీంతో రెచ్చిపోయిన పవన్‌ అభిమానులు తిరగబడ్డారు. ఆ తరువాత గొడవ చినికి చినికి గాలివానలా మారింది. సర్ది చెప్పటానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై పిడిగుద్దులుతో విరుచుకుపడ్డాడు కేసీ చేకూరి. వారి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు చేకూరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. రంగంలోకి దిగిన టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు
హైదరాబాద్‌లో 'ఖమేనీ' పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.?
హైదరాబాద్‌లో 'ఖమేనీ' పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.?