@POTUS Twitter Account : అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వచ్చి చేరారు. ట్విటర్‌లో సున్నా ఫాలోవర్లతో మొదలైన ఆయన అధికారిక ఖాతా ఇప్పుడు ఐదు మిలియన్లకు చేరుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం నాటికి సున్నా ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 57 లక్షలకు చేరుకోవటం విశేషం.
ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUS ను ట్విటర్ యాజమాన్యం బైడెన్‌కు బదలాయించిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది ట్విట్టర్. అంతే కాదు అధ్యక్షుడిగా ఉన్నప్పటి లక్షలాది ఫాలోవర్లను తొలగించింది ట్విట్టర్. బైడెన్‌కు పోటస్ ఖాతాను అప్పగించే సమయానికి ఫాలోవర్ల సంఖ్యను సున్నా చేసింది. దీనిపై బైడెన్ బృందం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోటస్‌ను అనుసరించిన వాళ్లు కావాలనుకుంటే మళ్లీ అదే ఖాతాను ఫాలో అవ్వొచ్చని ట్విటర్ స్పష్టం చేసింది.
అయితే సున్నా ఫాలోవర్లతో మొదలైనప్పటికీ.. బైడెన్‌కు ట్విటర్‌లో తొలిరోజే విశేషాదరణను దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయనను పోటస్ ఖాతా నుంచి అనుసరించేవారి సంఖ్య 57లక్షలకు పైనే ఉంది. అయితే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికారిక ఖాతా @VPని ఏకంగా 74లక్షల మందికి పైనే అనుసరిస్తుండటం విశేషం.