వ్యాక్సిన్ లేకుండానే కరోనా ఖతం.. ట్రంప్ కొత్త భాష్యం

| Edited By: Rajesh Sharma

May 09, 2020 | 3:24 PM

కరోనా వ్యాధి వ్యాక్సీన్ లేకుండానే ఖతమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ వైరస్ నశించాలంటే మనకు వ్యాక్సీన్ అవసరం లేదని.. ఇది అవసరమంటూ డాక్టర్లు చెబుతున్న...

వ్యాక్సిన్ లేకుండానే కరోనా ఖతం.. ట్రంప్ కొత్త భాష్యం
Follow us on

కరోనా వ్యాధి వ్యాక్సీన్ లేకుండానే ఖతమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ వైరస్ నశించాలంటే మనకు వ్యాక్సీన్ అవసరం లేదని.. ఇది అవసరమంటూ డాక్టర్లు చెబుతున్న దాన్ని తను నమ్మలేనని అన్నాడు.  వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫోజీ చేసిన వ్యాఖ్యలకు విరుధ్ధంగా మాట్లాడిన ఆయన.. టెస్టుల మాదిరే తాను వ్యాక్సీన్ ను కూడా భావిస్తానని, అసలు ఇది లేకుండానే కరోనా వ్యాధి నయమవుతుందని అన్నాడు. ‘ ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మళ్ళీ వాటి జాడ కనబడదని ..ప్రతిదీ మరణించినట్టే అది కూడా మరణిస్తుందని ఆయన చెప్పారు. వరుసగా ఏదో ఒక కాలంలో ఈ వైరస్ లన్నీ నశించడం గ్యారంటీ అని ట్రంప్ ‘జోస్యం’ చెప్పారు.  కానీ వ్యాక్సీన్ ఉండడం మంచిదే.. అని మనకు సాయపడుతుంది కూడా అన్నారు.

కాగా-డాక్టర్ ఫోజీ మాత్రం కరోనా వ్యాధి చికిత్స కోసం వ్యాక్సీన్ అవసరం ఎంతయినా ఉందని చెబుతున్నారు. మనకు శాస్త్రీయమైన, సురక్షితమైన ఈ టీకా ఉండాలని, ఇది ఉంటేనే మనలను మనం రక్షించుకోగలుగుతామన్నారు. అయితే ఈ మధ్యే  ట్రంప్ ‘గారు’ కరోనా వ్యాధి చికిత్సకు వ్యాక్సీన్ ఎంతయినా అవసరమని, బహుశా ఏడాదిలోగా ఇది మనకు అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పుడు మాట మార్చి అసలు ఇది అవసరమే లేదని ఢంకా బజాయిస్తున్నారు.