అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు మళ్లీ కలకలం సృష్టించాయి. రాజధాని వాషింగ్టన్ నగరంలోని పలు వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. రాత్రి 10గంటల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఘటనా స్థలం నుంచి వైట్ హౌస్ మూడు కిలోమీట్లర దూరంలో ఉంది.