Joe Biden Pronita Gupta: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారత సంతతికి చెందిన మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ పాలసీ కౌన్సిల్‌లో కార్మిక, ఉద్యోగ విభాగాలకు సంబంధించి బైడెన్ ప్రత్యేక సహాయకురాలిగా భారతీయ అమెరికన్ ప్రొనీతా గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకనట విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె సెంటర్ ఫర్ లా అండ్ సోషల్ పాలసీలో జాబ్ క్వాలిటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ జీతంపై పని చేసే ఫ్యామిలీలకు పని, ఆర్థిక భద్రతను కల్పించడంలో ప్రొనితా తనవంతు కృషి చేశారు.
మాజీ ఆధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమె అమెరికా కార్మిక విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి 2017 జనవరి వరకు యూఎస్ కార్మిక విభాగం ఉమెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. అయితే తక్కువ వేతనంపై పని చేసే కార్మికుల కోసం, పని జరిగే చోట వర్ణవివక్షతను రూపుమాపడంలోనూ ఆమె ఎంతగానో కృషి చేశారు. అమెరికా పురోగతిలో ప్రసిడెంట్ బైడెన్ అజెండాను అమలు చేయడంలో ఆమె మించిన మరొక వ్యక్తి లేరు అని సీఎల్‌ఏఎస్‌పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒలివియా గోల్డెన్ అన్నారు. లాస్ ఏంజిల్స్‌లోని ప్రొనీతా రిసెర్చ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆమె కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంపీఏ, క్లార్క్ యూనివర్సిటీ నుంచి బీఏ ఇన్ గవర్నమెంట్ పట్టాలు సైతం పొందారు.
Also Read: Donald Trump: చిక్కుల్లో పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ కోర్టులో కేసు