భారత సంతతి మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు.. అడ్మినిస్ట్రేటివ్‌ లా సబ్‌కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమీలా జయపాల్

|

Mar 04, 2021 | 5:58 PM

భారతీయ సంతతి మహిళకు అమెరికాలో మరో అరుదై గౌరవం దక్కింది. తాజాగా భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను మరో ఉన్నత పదవికి ఎంపిక చేశారు.

భారత సంతతి మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు.. అడ్మినిస్ట్రేటివ్‌ లా సబ్‌కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమీలా జయపాల్
Follow us on

Indo-American Pramila Jayapal : భారతీయ సంతతి మహిళకు అమెరికాలో మరో అరుదై గౌరవం దక్కింది. కొత్తగా అమెరికా అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌ తన పాలనావిభాగంలో ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను మరో ఉన్నత పదవికి ఎంపిక చేశారు. యాంటీట్రస్ట్‌, కమర్షియల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా సబ్‌కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమీలాను నియమిస్తూ అధ్యక్షులు జో బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఈ ఉన్నత పదవికి నియమించడం పట్ల ప్రమీలా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన జయపాల్ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగారు. వివిధ రంగాల్లో గుత్తాధిపత్య పోకడలను ఆమె వ్యతిరేకించారు. జర్నలిజంలో స్వేచ్చ కోసం ఆమె పోరాడారు. సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త అవిష్కరణలకు ఆమె నాయకత్వం వహించారు. అమెరికా ప్రతినిధుల సభలో ఉన్న ఏకైక భారత సంతతి అమెరికా మహిళ జయపాల్ కావడం విశేషం.. ఆమె ఇటీవల మొట్టమొదటి కాంగ్రెస్ యాంటీ ట్రస్ట్ దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించారు.

కాగా, 2020 డిసెంబరులో యూఎస్ పార్లమెంటు కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ (సీపీసీ) అధ్యక్షురాలిగా ప్రమీలా ఎన్నికైన విషయం తెలిసిందే. హేట్ ఫ్రీ జోన్‌ను స్థాపించి అమెరికాలో ఆసియా సంతతికి చెందిన ప్రజలకు విశేష సేవలందించారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత పారదర్శకంగా, సరళంగా చేయడానికి తనవంతు కృషి చేశారు.

ఇదీ చదవండిః Snakes Fight in Odisha : రెండు పాముల మధ్య భీకర యుద్ధం.. సోషల్ మీడియాలో వైరల్