కమలాహారిస్‌పై కమ్యూనిస్టు ముద్ర వేసిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నోటి దురుసును ప్రదర్శించారు.. ఎప్పుడూ అవతలివారిపై విరుచుకుపడే తత్త్వమున్న ట్రంప్‌ ఈసారి డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌పై విమర్శలు గుప్పించారు..

కమలాహారిస్‌పై కమ్యూనిస్టు ముద్ర వేసిన ట్రంప్‌

Edited By:

Updated on: Oct 09, 2020 | 5:08 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నోటి దురుసును ప్రదర్శించారు.. ఎప్పుడూ అవతలివారిపై విరుచుకుపడే తత్త్వమున్న ట్రంప్‌ ఈసారి డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌పై విమర్శలు గుప్పించారు.. కమలాహారిస్ స్తోత్రాన్ని పఠించడం ట్రంప్‌కు కొత్తేమీ కాకపోయినా ఇప్పుడు మాత్రం ఇంకాస్తా ఘాటైన పదాలు వాడారు.. కమలాహారిస్‌పై కమ్యూనిస్టు ముద్ర వేశారు.. ఆమె చాలా భయంకరమైన వ్యక్తి అని ఆరోపించారు.. ఒకవేళ 77 ఏళ్ల జో బైడెన్‌ కనుక గెలిస్తే మాత్రం రెండు నెలలు తిరగకుండానే జో బైడెన్‌ను గద్దె దింపేసి కమల అధ్యక్ష పీఠంలో కూర్చుంటారనే సంచలన వ్యాఖ్య చేశారు.. మొన్న జరిగిన వైస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి మైక్‌ పెన్స్‌, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య గట్టి చర్చే జరిగింది.. ఇందులో కమలాహారిస్‌దే పైచేయి అయ్యింది.. అన్ని రంగాలలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెబుతూ అందుకు ఆధారాలను కూడా చూపించారు కమలాహారిస్‌..ఇదే ట్రంప్‌కు కడుపుమంట తెప్పించినట్టుగా ఉంది.. అందుకే కమలపై కస్సుబుస్సుమంటున్నారు.. డిబేట్‌పై వ్యాఖ్యానిస్తూ అసలది చర్చే కాదు పొమ్మన్నారు.. ఆమె కంటే ఘోరంగా ఇంకెవరూ ఉండరంటూ తిట్టిపోశారు. ఆమె కమ్యూనిస్టు అని, సెనెటర్‌ బెర్నే సాండర్స్‌కు ఆమె మద్దతునిస్తారని, ఆమె గెలిస్తే మనం కమ్యూనిస్టు పాలన చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కూడా కమలను నానా మాటలన్నారు ట్రంప్‌.. ఆమె సోషలిస్టు కాదని, హంతకులు, రేపిస్టులను దేశంలోకి అనుమతించేలా సరిహద్దు ద్వారాలను తెరుస్తారని ట్రంప్‌ అన్నారు. కమలను ఉద్దేశించి అసహనంతో అనేక సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు ట్రంప్‌..