అమెరికాను కూడా భయపెడుతోన్న పండుగల సీజన్‌

|

Nov 30, 2020 | 11:16 AM

కరోనా వైరస్‌ అమెరికాలాంటి అగ్రరాజ్యాన్నే అతలాకుతలం చేస్తోంది.. ఆ వైరస్‌ను నియంత్రించలేక అమెరికా ఏనాడో చేతులెత్తేసింది. సెకండ్‌ వేవో, థర్డ్‌ వేవో తెలియదు కానీ అమెరికాలో మాత్రం కేసులు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి..

అమెరికాను కూడా భయపెడుతోన్న పండుగల సీజన్‌
Follow us on

కరోనా వైరస్‌ అమెరికాలాంటి అగ్రరాజ్యాన్నే అతలాకుతలం చేస్తోంది.. ఆ వైరస్‌ను నియంత్రించలేక అమెరికా ఏనాడో చేతులెత్తేసింది. సెకండ్‌ వేవో, థర్డ్‌ వేవో తెలియదు కానీ అమెరికాలో మాత్రం కేసులు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి.. రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.. అందుకు కారణం పండుగలే! ఓనం పండుగ తర్వాత కేరళలో కేసులు ఎలా పెరిగాయో మనకు అనుభవమే. మరికొద్ది రోజుల్లో క్రిస్‌మస్‌, థాంక్స్‌ గివింగ్‌ వేడుకలు జరగబోతున్నాయి.. ఈ రెండింటినీ సామూహికంగా జరుపుకుంటారు ప్రజలు.. కుటుంబసభ్యులే కాదు, బంధుమిత్రులు కూడా సమావేశమవుతారు.. ఈ పండుగల రత్వాత కేసులు భారీగా పెరుగుతాయని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంటున్నారు.. థాంక్స్‌ గివంగ్‌ ఉత్సవం తర్వాత కేసులు బాగా పెరుగుతాయని అంచనా వేశారాయన! పండుగ సీజన్‌ కాబట్టి సమావేశాలు ఎక్కువగా ఉంటాయని, కరోనా వ్యాప్తి తీవ్రతకు ఇది కారణమవుతుందని చెప్పారు. కరోనాను సమర్థంగా నియంత్రించిన దేశాలలో కూడా ఇప్పుడు వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న సంగతిని విస్మరించకూడదని సూచించారు. ఎంత కాదన్నా కరోనాకు వ్యాక్సిన్‌ రావడానికి రెండు మూడు నెలలు పడుతుందని, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని సలహా ఇచ్చారు ఫౌచి. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య కోటి 30 లక్షలు దాటింది. 2,65,000 మంది కరోనాతో చనిపోయారు.