ఎన్నికలలో రిగ్గింగ్‌ చేసి బైడెన్‌ గెలిచాడు, అసలైన విజేతను తానేనని చెప్పుకుంటున్న ట్రంప్

|

Dec 07, 2020 | 11:25 AM

పదవిలోంచి దిగిపోవడం ఎవరికైనా బాధాకరమే! మరి అమెరికా వంటి అగ్రరాజ్యానికి అయిదేళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన తర్వాత గద్దె దిగాల్సి రావడం బాధే కదా! అందుకే డొనాల్డ్ ట్రంప్‌ ఓటమిని అస్సలు అంగీకరించడం లేదు..

ఎన్నికలలో రిగ్గింగ్‌ చేసి బైడెన్‌ గెలిచాడు, అసలైన విజేతను తానేనని చెప్పుకుంటున్న ట్రంప్
Follow us on

పదవిలోంచి దిగిపోవడం ఎవరికైనా బాధాకరమే! మరి అమెరికా వంటి అగ్రరాజ్యానికి అయిదేళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన తర్వాత గద్దె దిగాల్సి రావడం బాధే కదా! అందుకే డొనాల్డ్ ట్రంప్‌ ఓటమిని అస్సలు అంగీకరించడం లేదు.. ఎన్నికలలో గెలిచింది తానేనని చెప్పిందే చెప్పుకొస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రిగ్గింగ్‌ జరిగిందని, జో బౌడెన్‌ మోసం చేసి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని ఆరోపించారు. డెమొక్రాట్లు మోసానికి పాల్పడ్డారని, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేశారని, అలా చేయడం వల్లనే బైడెన్‌ విజేతగా నిలిచారని ట్రంప్‌ ఆవేదన చెందారు. జనవరి 5న జరగనున్న స్పెషల్‌ సెనేట్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థుల ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జార్జియాలో ప్రచారం చేసిన ట్రంప్‌ ఈ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగితే ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. తాను నిజంగానే ఓడిపోయి ఉంటే చాలా హుందాగా ఇంటికి వెళ్లిపోయేవాడినని, కానీ తాను పరాజితుడిని కానని ట్రంప్‌ అన్నారు.