Joe Biden: ఆప్ఘానిస్థాన్ లో హింసకు ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని ఆమెరికా తెలిపింది. ఈ మేరకు ఆఫ్గాన్ నుంచి యూఎస్ దళాలను ఉపసంహరించుకోనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 1లోగా ఈ దళాల ఉపసంహరణ జరగనుంది. ప్రస్తుతం ఆప్ఘాన్‌లో 2500 యూఎస్ దళాలు ఉన్నాయి. నాటో సంకీర్ణంలో భాగంగా 7 వేల విదేశీ దళాలతో కలిసి పని చేస్తున్నాయి. మే 1 నుంచి దళాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని అమెరికా ప్రకటించింది.
ఇతర భాగస్వామ్యం దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృందం సూచనల ప్రకారం అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణపై బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. కాగా, 2001 సెప్టెంబర్ 11న యునైటెడ్ స్టేట్స్ తన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిని చవి చూసింది. ఈ దాడుల్లో మూడు వేల వరకు మరణించారు. కేవలం 102 నిమిషాల వ్యవధిలో ఆల్ ఖైదా విమానాలను హైజాక్ చేసి కూల్చివేయడంతో న్యూయార్క్ వర్డల్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన రెండు టవర్లు కూలిపోయాయి.
ఇవీ చదవండి: China: మన సరిహద్దులకు దగ్గరలో చైనా మరో ఏర్పాటు.. తన సైనికుల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు!