పడవల్లో రేగిన మంటలు.. 8 మంది మృతి.. పలువురు గల్లంతు

| Edited By:

Jan 28, 2020 | 11:59 AM

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా నదిలో. అలబామాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. నార్త్ అలబామాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంట ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 పడవలకు పైగా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. అంతా నిద్రలో ఉన్నారని.. దీంతో ప్రమాదాన్ని పసిగట్టలేక అగ్నికి ఆహుతయ్యారని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. అయితే కొందరు నదిలో […]

పడవల్లో రేగిన మంటలు.. 8 మంది మృతి.. పలువురు గల్లంతు
Follow us on

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా నదిలో. అలబామాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. నార్త్ అలబామాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంట ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 పడవలకు పైగా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. అంతా నిద్రలో ఉన్నారని.. దీంతో ప్రమాదాన్ని పసిగట్టలేక అగ్నికి ఆహుతయ్యారని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. అయితే కొందరు నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. అయితే పడవల్లో ఇంకా ఎంత మంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే సోమవారం అర్థరాత్రి సమయంలో.. జాక్సన్ కంట్రీ పార్క్‌లో అంటుకున్న మంటలు.. క్రమేపీ డాక్‌యార్డ్ వైపునకు వేగంగా విస్తరించాయి. దీంతో యార్డ్‌లో ఉన్న పడవలకు నిప్పంటుకుంది అయితే ఆ సమయంలో పడవలో ఉన్న వారు గాఢనిద్రలో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. దానికితోడుగా.. పడవలకు ఎక్కువగా చెక్కలతోనే నిర్మించినవి కావడంతో.. మంటలు శరవేగంగా వ్యాపించాయి. కేవలం పది నుంచి ఇరవై నిమిషాల్లోనే డాక్‌యార్డ్ మొత్తం మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు.