అమెరికానే కాదు.. ఆ దేశ అధ్యక్షుడు కొలువై ఉండే వైట్ హౌస్‌ను కూడా కరోనా గడగడలాడిస్తోంది… డొనాల్డ్ ట్రంప్‌నే కాదు.. ఆయన ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌కు కూడా కరోనా అంటుకుంది.. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన శ్వేతసౌధం సిబ్బంది సంఖ్య పదికి పెరిగింది.. ట్రంప్‌కు కరోనా సోకిందని తెలియగానే ఎందుకైనా మంచిదని ఈయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు..రోజూ కరోనా పరీక్షలను జరుపుకుంటున్నారు.. రోజూ నెగటివ్ వచ్చేది.. ఇవాళ మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. దీంతో స్టీఫెన్ మిల్లర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.. మిల్లర్ భార్య కేటీ మిల్లర్‌ను కూడా ఇంతకు ముందు కరోనా బాధించింది.. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా అంటుకోవడంతో ట్రంప్, ఆయన భార్య మెలానియాలు కూడా పరీక్షలు జరిపించుకున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది.. మిలటరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ట్రంప్ మొన్నే డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే వైట్‌హౌస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీతో పాటు మరో ముగ్గరు సిబ్బందికి కూడా పాజిటివ్ నమోదయ్యింది. వైట్ హౌస్ దగ్గర పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులకు కూడా కరోనా సోకింది. .