దారుణం: సమయానికి అంబులెన్స్ రాక సినీ నటి మృతి..!

రోడ్డు మీద వెళ్లేటప్పుడు వెనుక అంబులెన్స్ వస్తుంటే దయచేసి లైట్ తీసుకోకండి. దారిచ్చి..మనసులో అందులో ఉన్నవారికి ఏం కాకూడదని కోరుకోండి. అంతకుమించిన మానవత్వం మరోటి ఉండదు. అంబులెన్స్ కేవలం వాహనం మాత్రమే కాదు..ప్రాణాలు నిలిపే సంజీవని కూడా. సమయానికి అంబులెన్స్‌ రాకపోవడంతో మరాఠీ నటి మృతి చెందిన సంఘటన అందరిని విస్మయానికి గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన పూజ జుంజర్‌ అనే మరాఠీ నటికి ఆదివారం తెల్లవారు జామున […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:31 pm, Tue, 22 October 19

రోడ్డు మీద వెళ్లేటప్పుడు వెనుక అంబులెన్స్ వస్తుంటే దయచేసి లైట్ తీసుకోకండి. దారిచ్చి..మనసులో అందులో ఉన్నవారికి ఏం కాకూడదని కోరుకోండి. అంతకుమించిన మానవత్వం మరోటి ఉండదు. అంబులెన్స్ కేవలం వాహనం మాత్రమే కాదు..ప్రాణాలు నిలిపే సంజీవని కూడా.

సమయానికి అంబులెన్స్‌ రాకపోవడంతో మరాఠీ నటి మృతి చెందిన సంఘటన అందరిని విస్మయానికి గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన పూజ జుంజర్‌ అనే మరాఠీ నటికి ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కొన్నినిమిషాలకే కన్నుమూసింది. దీంతో వైద్యులు పూజ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఆ ఆసుపత్రి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అందుబాటులో ప్రభుత్వ  అంబులెన్స్ దొరకలేదు. దాంతో పూజా బంధువులు ఎలాగోలా కాస్త ఆలస్యంగా ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించింది. ఒకవేళ సకాలంలో అంబులెన్స్ వచ్చుంటే కచ్చితంగా ఆమె ప్రాణాలతో ఉండేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆమెతో పాటు పుట్టిన శిశువు కూడా మరణించడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. పూజ పలు మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.