జాతీయ పక్షిని చంపినందుకు.. జరిగిందో ఘోరం..

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జాతీయ పక్షి అయిన నెమళ్లను చంపిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. రాష్ట్రంలోని లసూడియా అత్రి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో మృతిచెందిన వ్యక్తిని హీరాలాల్ బన్చందగా గుర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నెమలిని చంపిన నలుగురు వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో పరుగెత్తుతుండగా… స్థానికులు వారిని గమనించారు. అయితే వారిలో ఒక హీరాలాల్ పట్టుకున్నారు. అతని వద్ద నాలుగు చనిపోయిన నెమళ్లను గుర్తించారు. అప్పటికే పెద్ద ఎత్తున […]

జాతీయ పక్షిని చంపినందుకు.. జరిగిందో ఘోరం..
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 7:37 PM

మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. జాతీయ పక్షి అయిన నెమళ్లను చంపిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. రాష్ట్రంలోని లసూడియా అత్రి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో మృతిచెందిన వ్యక్తిని హీరాలాల్ బన్చందగా గుర్తించారు.

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నెమలిని చంపిన నలుగురు వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో పరుగెత్తుతుండగా… స్థానికులు వారిని గమనించారు. అయితే వారిలో ఒక హీరాలాల్ పట్టుకున్నారు. అతని వద్ద నాలుగు చనిపోయిన నెమళ్లను గుర్తించారు. అప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హీరాలాల్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

అయితే దాడి జరుగుతుండగా.. ఓ వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ ద్వారా తమకు సమాచారం తెలిపాడని.. జిల్లా ఎస్పీ వెల్లడించారు. వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని.. నిందితుడిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడన్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించామని.. ఇప్పటికే తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మరోవైపు, నెమళ్లను చంపినందుకు మృతుడితో పాటు అతని కుమారుడు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో