Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • తీరం దాటుతున్న నిసర్గ తుఫాను. అలీబాగ్‌కు సమీపంలో తీరాన్ని తాకిన నిసర్గ. తీరాన్ని దాటేందుకు మరో గంట సమయం. ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం. సాయంత్రం గం. 7.00వరకు నిషేధించిన అధికార యంత్రాంగం.

ప్రకాశం జిల్లాలో దారుణం.. భార్యను కరెంట్ షాక్‌తో చంపేసిన భర్త

A man brutally murdered wife with current shock in prakasham district, ప్రకాశం జిల్లాలో దారుణం.. భార్యను కరెంట్ షాక్‌తో చంపేసిన భర్త

మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కరెంటు షాక్ ఇచ్చి చంపేశాడు. దారుణమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడులో మంగళవారం జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం.. మద్దిలకట్ట ఎస్సీ కాలనీకి చెందిన తంగిరాల యోహాన్‌, తోకపల్లి గ్రామానికి చెందిన శ్రావణి ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లికి ముందునుంచి మద్యానికి బానిసైన యోహాను ..భార్య శ్రావణితో ప్రతిరోజు గొడవపడుతూ ఆమెన శారీరకంగా చిత్రహింసలపాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఈనేపథ్యంలోఆమె నిద్రపోయిన తర్వాత కరెంటు తీగలు భార్య మెడకు తాకించి.. షాక్ కొట్టించి అతి దారుణంగా చంపేశాడు.

అయితే మంగళవారం ఉదయం శ్రావణి ఉరివేసుకుని చనిపోయినట్టుగా గ్రామస్తుల్ని నమ్మించి.. అక్కడినుంచి పారిపోయాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Related Tags