టైర్ పేలడంతో.. బావిలో పడ్డ ఆటో.. 8మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తిరుచ్చి జిల్లా ఓ మినీ ఆటో అదుపుతప్పి బావిలో పడింది. టైర్ పేలడంతో డ్రైవర్ ఆటోను కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంతలో అటువైపుగా ఉన్న 80 అడుగుల లోతు ఉన్న బావిలో ఆటో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి-తిరువాయూర్ రోడ్‌లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:49 am, Mon, 19 August 19
Tamil nadu Accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తిరుచ్చి జిల్లా ఓ మినీ ఆటో అదుపుతప్పి బావిలో పడింది. టైర్ పేలడంతో డ్రైవర్ ఆటోను కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంతలో అటువైపుగా ఉన్న 80 అడుగుల లోతు ఉన్న బావిలో ఆటో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి-తిరువాయూర్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tamilnadu