వడదెబ్బ …అలర్ట్ కాకుంటే డేంజరే

సమ్మర్.. ఏరోజుకారోజు భానుడి భగభగలు తెలుగు రాష్ట్రాలను ‘ మండిస్తున్నాయి ‘. మండే ఎండలకు భయపడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతుండగా..జనం చల్లని కూల్ డ్రింకులు, కొబ్బరి నీళ్ళు, చెరకు రసాలను ‘ ఆశ్రయిస్తున్నారు ‘. ఈ వేసవిలో రోజుకు పది  వడదెబ్బ కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్నాయి. డీ-హైడ్రేషన్, వాంతులు వంటి వివిధ రుగ్మతలతో రోగులు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఈ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాలుగు నుంచి అయిదారు కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీలకు పెరగడంతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ తగులకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంతవరకు ఉదయం 11 -సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగకుండా చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ వేసవిలో  పారాసిటమాల్ వంటి మాత్రలు వాడవచ్చునని, తరచూ గ్లూకోజ్ వాటర్ తాగడం కూడా మంచిదేనని వారు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *