కరోనాపై పోరులో.. తెలంగాణ ప్రభుత్వానికి.. జీ తెలుగు మద్దతు..

కోవిద్‌-19 ‌మహమ్మారి తో చాల వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. చాలామంది తమ ఉపాధిని కోల్పోయారు. ‌సినీ, టీవీ, నిర్మాణరంగం మొదలుకుని చాలా రంగాలు కుదేలయ్యాయి.

కరోనాపై పోరులో.. తెలంగాణ ప్రభుత్వానికి.. జీ తెలుగు మద్దతు..
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 6:01 PM

కోవిద్‌-19 ‌మహమ్మారి తో చాల వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. చాలామంది తమ ఉపాధిని కోల్పోయారు. ‌సినీ, టీవీ, నిర్మాణరంగం మొదలుకుని చాలా రంగాలు కుదేలయ్యాయి. కోవిడ్‌-19 ‌మహమ్మారిపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకులు సిద్ధంగా ఉంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా వారికీ వివిధ కార్యక్రమాల రూపంలో సహాయాన్ని అందిస్తోంది.

దీంతో స్ఫూర్తి పొందిన జీ తెలుగు కూడా తన వంతుగా సేవ కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగానికి పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. భారత్ లోని 10 నగరాల్లో వైద్య పరికరాలను అందివ్వాలనే జీ నెట్ వర్క్ సంకల్పంలో భాగంగా వైద్య పరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తోంది జీ తెలుగు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీ తెలుగు.. 4,000 పిపిఈ కిట్లు, 16 అంబులెన్స లను అందజేయనున్నట్టు బిజినెస్ హెడ్ అనూరాధ గూడూరు మరియు సీనియర్ హెచ్ ఆర్ బిజినెస్ పార్థనర్ సౌత్, శ్రీధర్ మూలగడ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కి తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై పోరాడేందుకు జీ తెలుగు చేస్తున్న ప్రయత్నాలను ట్విట్టర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లెైక్ చేశారు.

దేశవ్యాప్తంగా 10,000 మంది వలస కార్మికులకు మద్దతుగా 200 అంబులెన్సులు, 40,000 పిపిఇ కిట్లు, 100 పోర్టబుల్ ఐసియులు మరియు 6,00,000 రోజువారీ భోజన ఖర్చుని విరాళంగా ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక అధికారులకు మద్దతు ఇస్తామని జీ నెట్ వర్క్ ప్రతిజ్ఞ చేసింది. నోయిడా, ముంబై, చండీగఢ, జైపూర్, కోల్ కతా, భువనేశ్వర్, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై నగరాల్లో జీ నెట్ వర్క్ తన సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.