నేడు గవర్నర్‌ను వద్దకు జగన్‌

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు […]

  • Ram Naramaneni
  • Publish Date - 11:19 am, Sat, 16 March 19

హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం తీసుకెళ్లనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్లజెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని, ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని జగన్ పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు