‘కేజీఎఫ్’ హీరో కూతురికి పేరు పెడతారా.!

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా  ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్.గత ఏడాది డిసెంబర్ లో యష్, రాధిక దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా యష్ తన అభిమానులతో పంచుకున్నాడు. కాగా అక్షయ తృతీయ పురస్కరించుకుని పాప తొలి ఫోటోను యష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ‘నా ప్రపంచాన్ని పాలిస్తున్న అమ్మాయిని చూడండి. తనకు ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటి నుంచి తనను ‘బేబీ వైఆర్‌’ అని పిలవండి. […]

  • Ravi Kiran
  • Publish Date - 11:07 am, Wed, 8 May 19

‘కేజీఎఫ్‌’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా  ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్.గత ఏడాది డిసెంబర్ లో యష్, రాధిక దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా యష్ తన అభిమానులతో పంచుకున్నాడు. కాగా అక్షయ తృతీయ పురస్కరించుకుని పాప తొలి ఫోటోను యష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ‘నా ప్రపంచాన్ని పాలిస్తున్న అమ్మాయిని చూడండి. తనకు ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటి నుంచి తనను ‘బేబీ వైఆర్‌’ అని పిలవండి. పాపపై మీ ప్రేమను కురిపించండి, ఆశీర్వదించండి’ అని యష్ ట్వీట్‌ చేశాడు.

మరోవైపు యష్ సతీమణి రాధికా పండిట్ తొలినాళ్లలో బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత 2008లో ‘మూగిన మనసు’ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో యష్ హీరోగా నటించాడు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2016లో కుటుంబ సభ్యుల సమ్మతితో వీరి వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్‌’ పార్ట్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్‌ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.