YouGov survey 2021: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించే పురుషుల జాబితాలో ప్రధాని మోడీ, విరాట్ కోహ్లీ.. మహిళల్లో ప్రియాంక చోప్రా

|

Dec 15, 2021 | 1:29 PM

2021లో ప్రపంచంలోని అత్యంత ఆరాధించే ప్రముఖుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

YouGov survey 2021: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించే పురుషుల జాబితాలో ప్రధాని మోడీ, విరాట్ కోహ్లీ.. మహిళల్లో ప్రియాంక చోప్రా
World's Most Admired Men
Follow us on

YouGov survey Report 2021: 2021లో ప్రపంచంలోని అత్యంత ఆరాధించే ప్రముఖుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. అదే సమయంలో, నటీమణులు ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో పాటు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి 2021 ప్రపంచంలోని అత్యంత ఆరాధించే మహిళల జాబితాలో ఉన్నారు. యూగోవ్ సర్వే ప్రకారం ఈ జాబితాను మంగళవారం విడుదల చేశారు.

YouGov అనేది బ్రిటీష్ అంతర్జాతీయ ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ, UKలో ప్రధాన కార్యాలయం ఉంది ఐరోపా, ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన, ప్రజాదరణ కలిగిన నేతలు, సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి గానూ జాబితాను మంగళవారం విడుదల చేసింది. సర్వేపద్దతిని వివరిస్తూ, YouGov వారు 38 దేశాల్లోని ప్యానెలిస్ట్‌ల నుండి ఓపెన్-ఎండ్ నామినేషన్‌లను సేకరించారు.

2021 సంవత్సరానికి గానూ YouGov’s వరల్డ్స్ మోస్ట్ అడ్మిర్డ్ మెన్‌ జాబితాను విడుదల యూ గోవ్ సంస్థ. ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ప్రపంచవ్యాప్తం ప్రముఖుల జాబితాను ప్రకటించింది. అంతర్జాతీయ సర్వే ప్రకారం, నరేంద్ర మోడీ ప్రపంచంలోని 8వ అత్యంత ఆరాధించే వ్యక్తి, ప్రపంచ రాజకీయ నాయకుల కంటే అగ్రస్థానంలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా, పోప్ ఫ్రాన్సిస్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వంటి అనేక మంది ఉన్నారు.38 దేశాలలో 42,000 కంటే ఎక్కువ మందిని సర్వే చేసింది.

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 2021లో ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధించే వ్యక్తిగా వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు. మాజీ POTUS 2020లో అమెరికన్ బిజినెస్ మాగ్నెట్ బిల్ గేట్స్‌తో పోటీ పడ్డారు. అతను అనేకసార్లు అగ్రస్థానంలో ఉన్నాడు. గేట్స్ ఇప్పుడు రెండవ స్థానానికి మారారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​రొనాల్డో, యాక్షన్ స్టార్ జాకీ చాన్, టెక్ మేధావి ఎలాన్ మస్క్, ఫుట్‌బాల్ సంచలనం లియోనెల్ మెస్సీ, ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా వ్యాపారవేత్త జాక్ మా మిగిలిన టాప్ 10 స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే పురుషులు 2021:

1. బరాక్ ఒబామా

2. బిల్ గేట్స్

3. జి జిన్‌పింగ్

4. క్రిస్టియానో​రొనాల్డో

5. జాకీ చాన్

6. ఎలోన్ మస్క్

7. లియోనెల్ మెస్సీ

8. నరేంద్ర మోడీ

9. వ్లాదిమిర్ పుతిన్

10. జాక్ మా

11. వారెన్ బఫెట్

12. సచిన్ టెండూల్కర్

13. డోనాల్డ్ ట్రంప్

14. షారుక్ ఖాన్

15. అమితాబ్ బచ్చన్

16. పోప్ ఫ్రాన్సిస్

17. ఇమ్రాన్ ఖాన్

18. విరాట్ కోహ్లీ

19. ఆండీ లౌ

20. జో బిడెన్


ప్రపంచంలో అత్యంత ఆరాధించే మహిళలు 2021

1. మిచెల్ ఒబామా

2. ఏంజెలీనా జోలీ

3. క్వీన్ ఎలిజబెత్ II

4. ఓప్రా విన్ఫ్రే

5. స్కార్లెట్ జాన్సన్

6. ఎమ్మా వాట్సన్

7. టేలర్ స్విఫ్ట్

8. ఏంజెలా మెర్కెల్

9. మలాలా యూసఫ్ జాయ్

10. ప్రియాంక చోప్రా

11. కమలా హారిస్

12. హిల్లరీ క్లింటన్

13. ఐశ్వర్య రాయ్ బచ్చన్

14. సుధా మూర్తి

15. గ్రెటా థన్‌బెర్గ్

16. మెలానియా ట్రంప్

17. లిసా

18. లియు యిఫీ

19. యాంగ్ మి

20. జసిందా ఆర్డెర్న్


ఇదిలావుంటే నవంబర్‌ నెలలో అమెరికన్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్’లో అత్యధిక శాతం రేటింగ్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. సంస్థ వెల్లడించిన డేటా ప్రకారం, PM మోడీ 70% స్కోర్‌తో అత్యధిక ఆమోదం పొందిన ప్రపంచ నాయకుడిగా ర్యాంక్‌ను పొందారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 66%, ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాగి 58% స్కోరుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (54%), ఆస్ట్రేలియన్ PM స్కాట్ మోరిసన్ (47%), US అధ్యక్షుడు జో బిడెన్ (44%), కెనడా PM జస్టిన్ ట్రూడో (43%) వంటి ఇతర ప్రపంచ నాయకులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నవంబర్ 4, 2021 నాటికి, సగటు భారతీయులలో 70% మంది ప్రధాని మోదీని ఆమోదించగా, కేవలం 24% మంది మాత్రమే ఆయనను వ్యతిరేకించారని రేటింగ్ పేర్కొంది.

Read Also…  Miss World 2021: మిస్ వరల్డ్ పోటీల్లో హైదరాబాదీ యువతి.. ఈ గ్లామర్ గర్ల్‌కు అందమైన రూపమే కాదు.. అందమైన మనసు కూడా.. వివరాల్లోకి వెళ్తే..