3D Train Station: 6 గంటల్లో కళ్లు చెదిరే అద్భుతం.. జపాన్‌ ఆవిష్కరణ చూస్తే మతి పోవాల్సిందే!

కొత్త ఆవిష్కరణలు సృష్టించడంలో జపాన్‌ ఎప్పుడూ ముందుంటుంది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై-స్పీడ్ రైలు వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో జపాన్ చేసిన ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ ఆవిష్కరణే చేసి జపాన్ మరోసారి వార్తల్లో నిలించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ సాంకేతికతతో జపాన్ ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మించింది.

3D Train Station: 6 గంటల్లో కళ్లు చెదిరే అద్భుతం.. జపాన్‌ ఆవిష్కరణ చూస్తే మతి పోవాల్సిందే!
Japan 3d Printed Station

Edited By:

Updated on: Apr 12, 2025 | 6:16 PM

జపాన్ కు చెందిన సెరెండిక్స్‌ అనే ఓ నిర్మాణసంస్థ కేవలం 6 గంటల్లోనే 3D రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. 3D-ప్రింటెడ్ విడి భాగాలను ఉపయోగించి ఈ సంస్థ అరిడా నగరంలో హాట్సుషిమా అనే కొత్త 3D రైల్వే స్టేషన్‌ నిర్మించింది. స్టేషన్ భాగాలను కుమామోటోలోని ఒక ఫ్యాక్టరీలో 3D ప్రింటింగ్ ద్వారా ముందుగా తయారు చేసి వాటిని ట్రక్కుల ద్వారా సైట్‌కు తీసుకొచ్చింది. ఈ విడిభాగాలను క్రేన్ సహాయంతో అసెంబుల్ చేసి 100 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ రైల్వే స్టేష్‌ను నిర్మించింది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం ఆరు గంటల్లోనే పూర్తి చేసింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి చివరి ట్రైన్‌ వెళ్లి ఉదయం మొదటి ట్రైన్‌ వచ్చేలోపు స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఈ స్టేషన్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే రెండు నెలల సమయం పట్టడంతో పాటు ఇప్పటి కన్నా రెట్టింపు ఖర్చు అయ్యేదని రైల్వేశాఖ, నిర్మాణ సంస్థ తెలిపింది.

స్టేషన్‌ను నిర్మించారు కానీ ఇది పూర్తిగా ఇప్పుడే అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం, స్టేషన్‌లో టికెట్ మెషీన్లు ఏర్పాటుతో పాటు కొన్ని ఇంటీరియర్ పనులు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని పనులు పూర్తి చేసి జులైలోపు ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..