Charles Sobhraj: సీరియల్ కిల్లర్ పక్కన కూర్చుంటే ఎట్టా ఉంటాదో తెలుసా.. ఛార్లెస్ శోభరాజ్ పక్కన కూర్చుని ప్రయాణిస్తే..

|

Dec 27, 2022 | 11:50 AM

చార్లెస్‌ శోభరాజ్‌ పేరు వినే ఉంటారు. ఈ కరుడుగట్టిన నరహంతకుడు, బికినీ కిల్లర్ జైలు నుంచి విడుదల విడుదలయ్యాడు. ఆయన పేరు మన దేశంలోనే కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా ఓ రకమైన ట్రెండ్ క్రియేట్ చేశాడు. అలాంటి వ్యక్తి మన పక్కన కూర్చుంటే..

Charles Sobhraj: సీరియల్ కిల్లర్ పక్కన కూర్చుంటే ఎట్టా ఉంటాదో తెలుసా.. ఛార్లెస్ శోభరాజ్ పక్కన కూర్చుని ప్రయాణిస్తే..
Charles Sobhraj Sitting Beside Her On Flight
Follow us on

పైకి మిస్టర్ పర్ఫెక్ట్‌లా కనిపిస్తాడు.. లోపలంతా మిస్టర్ కన్నింగ్.. అల్టిమేట్‌గా అతడొక ఘరానా మోసగాడు.. కబళించే కాలనాగు. అందం ప్లస్ తెలివి ప్లస్ దుర్భుద్ధి… ఈ మూడూ కలిసిన డెడ్లీ కాంబినేషన్ పేరే చార్లెస్ శోభ్‌రాజ్. బికినీ కిల్లర్‌గా వాల్డ్ ఫేమస్సు. అపరిచితుల్ని చేరదియ్యడం.. వాళ్లలో నమ్మకాన్ని కలిగించడం. మోసగించి దోచుకోవడం.. ఆ తర్వాత ప్రాణాలు తియ్యడం.. ఇదీ సీక్వెన్స్. అతనే ఛార్లెస్ శోభరాజ్.. ఈ జెనరేషన్‌కి పెద్దగా పరిచయం లేని అంతర్జాతీయ దొంగ. అంతే కాదు అతనికి రాని బాష అంటు లేదనే చెప్పాలి.. అంతర్జాతీయ బాషలను ఇట్టే నేర్చుకుంటాడు. ఫ్రాన్స్, ఇంగ్లీష్, హిందీ, అరబ్బీ, ఉర్దూ, జపానీ, నేపాలీ, ఇలా చాలా బాషల్లో అనర్గలంగా మాట్లాడగలడు. ప్రస్తుతం ఇతని వయసు 78 ఏళ్లు.. 31 సంవత్సరాలు జైల్లోనే గడిపేశాడు. ఊచల్లెకబెడుతూనే దేశదేశాల్లో పాపులారిటీ పెంచుకుని.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిన శోభరాజ్‌.. ఇప్పుడు స్వేచ్ఛా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 19 ఏళ్ల కారాగారం తర్వాత.. అతడ్ని విడుదల చెయ్యాలని ఆదేశించింది నేపాల్ సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇతను నేరుగా తన స్వంత దేశం వెళ్లిపోయాడు.

టోటల్ లైఫ్‌ స్పాన్‌లో అతడు చేసిన మర్డర్ల సంఖ్య 20కి పైనే. యావత్ ప్రపంచం చూపునూ తనవైపు తిప్పుకునేలా చేసిన శోభరాజ్‌ నేరశైలి మాత్రం వెరీ యూనిక్. చోర కళలో ఆరితేరిన ఛార్లెస్ శోభరాజ్‌ పుట్టుకేంటి.. అతడి జీవనవిధానమేంటి.. ఎందుకు నేరస్థుడుగా మారాడు.. క్రైమ్‌నే కెరీర్‌గా ఎందుకు మార్చుకున్నాడు..? ఇలాంటి అంశాలపై బాలీవుడ్ నుంచి మొదలు అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు, వెబ్ సరీస్, సీరియల్స్ తెరకెక్కాయి.

ఇండియన్ తండ్రి హాత్‌చంద్, వియత్నాం తల్లి ట్రాన్ లొవాంగ్.. శోభ్‌రాజ్ పుట్టగానే విడాకులు తీసుకున్నారు. మారు తండ్రి కూడా నిర్లక్ష్యం చెయ్యడంతో టీనేజ్‌లోనే దారితప్పింది శోభరాజ్ జీవితం. పారిస్ పారిపోయి… చిన్నచిన్న నేరాలు చేస్తూ 19 ఏళ్లవయసులోనే జైలుపాలయ్యాడు.

‘బికినీ కిల్లర్’ చార్లెస్ శోభరాజ్ నేపాల్ నుండి విడుదలైన తర్వాత ఫ్రాన్స్ చేరుకున్నాడు. శోభరాజ్ ఖతార్ ఎయిర్‌వేస్ విమానం QR647లో దోహాకు వెళ్లాడు, అక్కడి నుండి పారిస్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడే ఓ గమ్మతైన సంఘటన జరిగింది. శోభరాజ్ నేపాల్ నుంచి ఫ్రాన్స్‌కు సాధారణ పౌరుడిలో విమానంలో పయనమయ్యాడు. అయితే, తమతో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సీరియల్ కిల్లర్ అని అక్కడివారికి తెలియదు. ఈ సందర్భాన్ని బట్టి ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అతని పక్కన కూర్చున్న మహిళ ఫోటో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

అలా దోహా నుంచి మరోసారి గాలిలోకి ఎగిరిన విమానంలో ఓ వ్యక్తి చార్లెస్ శోభరాజ్‌ను గుర్తు పట్టాడు. అంతే కాదు తనకు ఓ సెల్ఫీ కావాలని రెక్వెస్ట్ చేశాడు. అయితే, కోవిడ్ ఆంక్షలతో అందులో ప్రయాణిస్తున్నవారు మాస్కులు ధరించి ఉన్నారు. ఓసారి మాస్క్ తీయాలని కోరాడు.

అతను మాస్క్ తీయడం ఫోటో దిగడం ముగిసింది. సెల్ఫీ దిగిన తర్వాత శోభరాజ్‌కు అతను థ్యాంక్స్ చెప్పినప్పుడు అందరికి తెలిసింది. తాము ఓ సీరియల్ కిల్లర్‌తో ప్రయాణిస్తున్నామని.. అంతే షాక్.. వెనుక సీట్లో కూర్చుకున్న వారంతా ఓకే.. ఇక పక్కనే కూర్చున్న మహిళ పరిస్థితి చూడాలి. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై విపరీతంగా రియాక్షన్స్ వస్తున్నాయి.


ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరధాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం