అసలు ప్రతీ ఈజిప్ట్ మమ్మీస్ ముక్కులు మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యాయి..?

| Edited By:

Mar 15, 2019 | 4:44 PM

ఈజిప్ట్ అంటేనే గుర్తొచ్చేది మమ్మీస్. ప్రపంచవ్యాప్తంగా వీటికి ఒక ప్రాధాన్యత ఉంది. చాలా మంది వీటిని చూడటానికి కూడా వెళ్తూంటారు. కాగా.. ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం అందర్నీ ఆశ్చర్యవంతుల్ని చేస్తుంది. సాధారణంగా కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. కాగా.. ప్రతీ ఈజిప్ట్ దేవతల రూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతీ శిల్పానికి ముక్కులు కన్పించపోవడం ఇప్పుడు అనుమానించ దగ్గ విషయం. కాగా.. వీటిపై బ్రూక్లిన్ మ్యూజియమ్ క్యురేటర్ ఎడ్వర్డ్ బ్లీబెర్గ్ అనే శాస్త్రవేత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు. […]

అసలు ప్రతీ ఈజిప్ట్ మమ్మీస్ ముక్కులు మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యాయి..?
Follow us on

ఈజిప్ట్ అంటేనే గుర్తొచ్చేది మమ్మీస్. ప్రపంచవ్యాప్తంగా వీటికి ఒక ప్రాధాన్యత ఉంది. చాలా మంది వీటిని చూడటానికి కూడా వెళ్తూంటారు. కాగా.. ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం అందర్నీ ఆశ్చర్యవంతుల్ని చేస్తుంది. సాధారణంగా కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. కాగా.. ప్రతీ ఈజిప్ట్ దేవతల రూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతీ శిల్పానికి ముక్కులు కన్పించపోవడం ఇప్పుడు అనుమానించ దగ్గ విషయం.

కాగా.. వీటిపై బ్రూక్లిన్ మ్యూజియమ్ క్యురేటర్ ఎడ్వర్డ్ బ్లీబెర్గ్ అనే శాస్త్రవేత్త కొత్త పరిశోధనలు చేస్తున్నారు. ఈ శిల్పాల యొక్క ముక్కులు ఎవరైనా కావాలని ధ్వంసం చేసారా.. లేదా..? సహజంగా అవి ముక్కలు అవుతున్నాయా..? అనే వాటిపై రీసెర్చ్ నిర్వహించారు.

పులిట్జర్ ఆర్ట్స్ ఫౌండేషన్లో ఈ పాడైన శిల్పాలను ఎక్సిబిషన్లో ఉంచారు. ప్రాచీన కాలంలో వివిధ కారణాల వల్ల వీటిని టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేసేవారట. మరొకొన్నింటిని రాజకీయాల కారణంగా.. అలాగే.. అప్పట్లో సృష్టించిన పుకార్ల కారణంగానో కొందరు వీటిని ధ్వంసం చేశారు. మమ్మీస్ వల్ల అతీతశక్తులు సాధించవచ్చేనే కారాణాలు కూడా బలంగా వినిపిస్తూండేవని ఎడ్వర్ట్ అన్నారు. ఇప్పటికీ కూడా చాలా దాడులు ఈ మమ్మీస్ మీద జరుగుతున్నాయని పేర్కొన్నారు.

పైన తెలిపిన వాటికి ఉదాహరణగా అఖేనాటెన్ యుగాల నాటి అతి ప్రాచీన శిలాలను పులిటర్జ్ ఆర్ట్స్ ఆఫ్ ఫౌండేషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. వీటిపై అవగాహన పెంచడానికి, అలాగే.. ఈజిప్ట్ మమ్మీస్ ద్వారా ఎలాంటి శక్తులు లేవని తెలపడానికే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎడ్వర్ట్. 2019 మార్చి 22 నుంచి ఏప్రిల్ 11వరకు ఈ ఎగ్జిబిషన్లో వీటిని ప్రదర్శించడం జరుగుతుందని ఆయన తెలిపారు.