ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలు వణికిస్తోంది. దీని తదుపరి వేరియంట్లు అంటువ్యాధిలా మారిపోయే అవకాశం ఉందన్న డబ్య్లూహెచ్ఓ ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. Omicron వేరియంట్ చివరిది కాదని, దీని తదనంతరం వచ్చే రూపాంతరాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. మున్ముందు ఇది అంటువ్యాధిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇవి ఏ విధంగా రూపాంతరం చెందుతాయో కచ్చితంగా అంచనా వేయలేమని తెలిపింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ..మహమ్మారి రూపాంతరం చెందకుండా చూడటం ఒక్కటే మనం చేయాల్సిన పని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిణి మారి వాన్ కెర్ కెర్‌ఖోవ్ వెల్లడించారు.
” ఒమిక్రాన్ అనేది చివరి వేరియంట్ కాదు. దీని తరువాత వచ్చే వేరియంట్లు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇది ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతుందో కచ్చింతగా అంచనా వేయలేం. టీకాల సామర్థ్యం పెరిగేలా చర్యలు చేపట్టాలి. అంతే కాకుండా వ్యాప్తిని తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలి. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా వేరియంట్ల వ్యాప్తి తక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.”
– మారి వాన్ కెర్‌ఖోవ్, WHO అధికారిణి