Bangladesh: షేక్ హాసీనా రాజీనామా చేయాలంటూ అల్టిమేటం జారీ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ జమాన్ ఎవరు?

బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఉద్యమానికి తలవంచి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. ప్రభుత్వ నివాసం 'ఘన భవన్' నుంచి తప్పించుకోవడానికి సైన్యం వారికి కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు.

Bangladesh: షేక్ హాసీనా రాజీనామా చేయాలంటూ అల్టిమేటం జారీ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ జమాన్ ఎవరు?
Sheikh Hasina Wakar Uz Zaman
Follow us

|

Updated on: Aug 06, 2024 | 6:19 PM

బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఉద్యమానికి తలవంచి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. ప్రభుత్వ నివాసం ‘ఘన భవన్’ నుంచి తప్పించుకోవడానికి సైన్యం వారికి కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. సైన్యాధిపతే ప్రధానికి అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. పదవి నుంచి వదిలిగిన ఆమె, తన సోదరి షేక్‌ రెహానాతో కలిసి భారత్ పయనమయ్యారు. ఈ పరిణామాలు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్‌ షహబుద్దీన్‌ ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఉన్నారు అక్కడ ఆమె NSA అజిత్ దోవల్ పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. షేక్ హసీనా ప్రస్తుతం షాక్‌లో ఉన్నారని, అందువల్ల తదుపరి ఏమి చేయాలనే దానిపై ఆమెతో చర్చలు జరగలేదని ప్రభుత్వం తెలిపింది.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల మంటల్లో కాలిపోయి వందలాది మంది చనిపోయారు. వేల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తిరుగుబాటు చేసిన విద్యార్థులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. అయితే, ఇలాంటి పరిస్థితిని సృష్టించి హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పాకిస్థాన్, ఐఎస్ఐ ఎప్పటి నుంచో సిద్ధమవుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి నిఘా వర్గాలు. బంగ్లాదేశ్ పోలీసులు, సైన్యం రెండూ ఈ తిరుగుబాటును అన్ని విధాలుగా అణిచివేసేందుకు ప్రయత్నించాయి. కానీ వారు కూడా విద్యార్థుల ఆందోళనల ముందు ఓడిపోయారు. రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనాను సైనిక హెలికాప్టర్‌లో ఢాకా నుండి భారతదేశానికి తరలించారు.

నిరసనల కారణంగా షేక్ హాసినా దేశం విడిచిపెట్టిన కొద్ది క్షణాల తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ పరిపాలనను చేపట్టి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో తాత్కాలిక సర్కార్‌ ఏర్పాటుకు కసరత్తును వేగవంతం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు షాబుద్దీన్‌ ఆర్మీ అధికారులు, విద్యార్ధి సంఘం నేతలతో చర్చలు జరిపారు. నోబెల్‌ విజేత మహ్మద్‌ యూనస్‌ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ప్రభుత్వంపై ఆర్మీ పూర్తి కంట్రోల్‌కు విద్యార్ధులు అంగీకరించడం లేదు.

ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో హసీనా సర్కార్‌పై తిరుగుబాటు వెనుక ఐఎస్‌ఐ ఉన్నట్టు భారత్‌ నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈమేరకు ముందుగానే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనాను సైతం హెచ్చరించింది. ఆర్మీ ఛీప్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌కు ఐఎస్‌ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. జమాన్‌ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన ఉన్నతాధికారి సూచించారు. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గుచూపింది. ఇక, విద్యార్ధుల ఉద్యమానికి నేతృత్వం వహించిన ఇస్లామిక్‌ ఛాత్ర శిబిర్‌ కూడా ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే పనిచేస్తోంది. విపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి కూడా పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌ను వ్యతిరేకించిన BNP నేత ఖలీదా జియా ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. తాత్కాలిక ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాకర్-ఉజ్-జమాన్ ఎవరు?

వాకర్-ఉజ్-జమాన్ ప్రస్తుత బంగ్లాదేశ్ దేశ సైన్యానికి అధిపతి. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. వాకర్-ఉజ్-జమాన్ జూన్ 23న మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. వాకర్-ఉజ్-జమాన్ 1966లో ఢాకాలో జన్మించారు. అతను జనరల్ ముహమ్మద్ ముస్తాఫిజుర్ రెహమాన్ కుమార్తె సరహ్నాజ్ కమలిక జమాన్‌ని వివాహం చేసుకున్నాడు. అతని బావ 1997 – 2000 మధ్య ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. వాకర్-ఉజ్-జమాన్ డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అతను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ బంగ్లాదేశ్ పూర్వ విద్యార్థి. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏ కూడా చదివాడు. ఆర్మీ చీఫ్ కావడానికి ముందు ఆరు నెలల పాటు జనరల్ స్టాఫ్ చీఫ్‌గా ఉన్నారు. ఆయనకు మూడు దశాబ్దాలకు పైగా కెరీర్ ఉంది. అతను ప్రధానమంత్రి కార్యాలయంలోని సాయుధ దళాల విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్‌గా షేక్ హసీనాతో కలిసి పనిచేశాడు. అయితే, బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనాను గద్దెదింపి పాలనా పగ్గాలు చేపట్టడం విశేషం..!

మరోవైపు సైన్యం , విద్యార్ధుల తిరుగుబాటుతో భారత్‌కు పారిపోయిన వచ్చిన బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఆమెకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. భారత్‌లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్‌ దౌత్యవర్గాలు వెల్లడించాయి. షేక్‌ హసీనా అమెరికా వీసా కూడా రద్దయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
294 పరుగులతో విధ్వంసం.. కన్నేసిన గంభీర్‌.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
అర్ధరాత్రి బాత్రూం వైపు నుంచి అరుపులు.. ఏంటా అని చూడగా
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
ఫ్లిప్‌కార్ట్‌ సేల్ వచ్చేసింది.. స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లు చెదిరే
ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్
ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్
విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ను నయం చేసుకోవచ్చు..
ఈ సింపుల్ ఎక్సర్‌ సైజులతో షుగర్‌ను నయం చేసుకోవచ్చు..
తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'..
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో రాజమౌళి 'మోడ్రన్ మాస్టర్స్'..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..