Death Valley: ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్ నెల వచ్చింది. ఈనెలలో సూర్యుడు రికార్డు స్థాయిలో మండిపోతున్నాడు. సమ్మర్ (Summer) సీజన్‌లో పలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేకపోతే భారీ ఎండలకు వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటం మేలంటున్నారు నిపుణులు. రానున్న 5 రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వీటిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇక ప్రపంచంలో అత్యధిక వేడికి పేరుగాంచిన ప్రదేశం కూడా ఉంది. దాని పేరు డెత్ వ్యాలీ. ఇది అమెరికా (America)లోని కాలిఫోర్నియా (California)లో ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డెత్ వ్యాలీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
బీబీసీ నివేదిక ప్రకారం.. డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రత 55 డిగ్రీలకు చేరుకుంటుంది. అందుకే డెత్ వ్యాలీని ప్రపంచంలోని అత్యంత వేడి సృష్టించే ప్రదేశాల జాబితాలో చేర్చబడింది. ఈ ప్రదేశంలో చాలా చోట్ల బోర్డులు ఉన్నాయి. అందులో ఉదయం 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు అని స్పష్టంగా రాసి ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానేశారు.
ఈ లోయకు డెత్ వ్యాలీ అని పేరు పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది. నిజానికి 19వ శతాబ్దంలో చాలా బంగారం, వెండి గనులను గుర్తించారు. ఆ సమయంలో ప్రజలు ఈ లోయ గుండా వెళుతున్నప్పుడు అధిక వేడి వల్ల చనిపోయారు. అందుకే ఈ ప్రాంతానికి డెత్ వ్యాలీ అని పేరు పెట్టారు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఎర్రటి రాళ్లు వేడి ప్రభావాన్ని మరింత పెంచుతాయి. ఇది కాకుండా ఇక్కడ వార్షిక వర్షపాతం చాలా తక్కువ. 50 మిల్లీమీటర్ల వర్షం కూడా పడని ప్రాంతాలు ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా తక్కువ వర్షాలు కురిసే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేడిగా, పొడిగా ఉండే ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఉత్తర అమెరికాలో ఇది అత్యల్ప ప్రదేశం.
ఇవి కూడా చదవండి: