
1965 తరువాత ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పని, తీసుకోని నిర్ణయం.. ట్రంప్ తీసుకున్నారు. అధ్యక్షుడిగా తనకున్న అరుదైన అధికారాలను ఉపయోగించి మరీ నేషనల్ గార్డ్స్‌ను కాలిఫోర్నియాలో దించారు. నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించడమంటే, అదొక సైనిక చర్య అని చెప్పడమే. ట్రంప్ ఏకంగా నేషనల్ గార్డ్స్‌ను దించారంటే… వలసదారులను ఇకపై రోజులు లెక్కపెట్టుకోండనే సంకేతాలివ్వడమే. ఇంతకీ.. ఎక్కడ మొదలైంది రగడ? ట్రంప్ ఎందుకని అంత పట్టుదలతో ఉన్నారు? అమెరికాలో ఇంత క్రితం ఎప్పుడూ చూసి ఉండని ఘటనలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. వచ్చిపోయే పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్వడం అమెరికాలో కనిపించలేదెప్పుడు. రాళ్లు విసరడం కాదు.. ఏకంగా కార్లనే తగలబెడుతున్నారు ఆందోళనకారులు. లాస్‌ఏంజెల్స్‌లో ఎటు చూసినా తగలబడుతున్న కార్ల విజువల్సే కనిపిస్తున్నాయి. ఆందోళనకారులను అడ్డుకోడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగిస్తున్నారు. ఇంతకీ.. ఎందుకింత హింస చెలరేగింది. అమెరికాలో I.C.E. – ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ఒకటుంది. ఈ డిపార్ట్‌మెంట్ అధికారులు జూన్ 6న లాస్ ఏంజెల్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ముఖ్యంగా ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లోని ఒక గోడౌన్, హోమ్ డిపో స్టోర్స్ దగ్గర, ఇతర ప్రాంతాల్లో ICE అధికారులు రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో 44 మందిని ‘అడ్మినిస్ట్రేటివ్ అరెస్ట్’ చేశారు. అంటే.. కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేని ఒక అరెస్ట్. 44 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అడ్డుకున్నందుకు మరొకరిని ఒకరిని...