ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్‌గా పకడ్బందీ వ్యూహాం.. 48 గంటల్లో ఏం జరగబోతుంది?

ఇరాన్‌ను సెంటర్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్.. దాన్ని అమలు చేసేందుకు అమెరికా సాయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే తాను కలిసిన తొలి నేత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే. ఈ ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు 5దఫాలు ఇరువురి మధ్య సమావేశాలు జరిగాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్‌గా పకడ్బందీ వ్యూహాం.. 48 గంటల్లో ఏం జరగబోతుంది?
Us In Israel Iran War

Updated on: Jun 20, 2025 | 5:18 PM

ఇరాన్‌ను సెంటర్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్.. దాన్ని అమలు చేసేందుకు అమెరికా సాయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే తాను కలిసిన తొలి నేత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే. ఈ ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు 5దఫాలు ఇరువురి మధ్య సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎక్కువగా ఇద్దరి మధ్య వచ్చిన డిస్కస్ పాయింట్.. ఇరాన్‌ను దెబ్బకొట్టడం. ఇప్పుడు ఏ ప్లాన్‌ను ఎలా అమలు చేశారో.. సమగ్రంగా తెలుసుకుందాం..

ఇరాన్‌ అంతమే నా పంతం. అంతవరకు రప్పా రప్పా మిస్సైళ్లతో దాడులే.. ఇందులో ఎవరు ఏం చెప్పినా వినేదేలే అంటూ ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. వందల మిస్సైళ్లతో ఇరాన్‌ను ఊపిరాడకుండా చేస్తోంది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్‌గా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది అనే కంటే.. ఇరాన్‌ను ఇజ్రాయెల్ ఎలా మడతపెట్టింది అన్నదే అంతర్జాతీయ సమాజం డిస్కస్ చేస్తోంది. ఇదేమీ ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్‌కు పుట్టిన ఆలోచన కాదు. తన అస్తిత్వానికి ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ భావిస్తే.. ఆదేశాన్ని అన్నిరకాలుగా దెబ్బతీసేదాకా వదలదు. ఇరాన్ ఎప్పటికైనా డేంజరేనని ఇజ్రాయెల్ దశాబ్దాల క్రితమే భావించింది. అందుకే.. దాన్ని అంతం చేసేందుకు ఎప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అదిప్పటికీ సెట్ అయింది.. ఇరాన్‌ను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ నాలుగు ప్లాన్‌లను సిద్ధం చేసింది.

  • ప్లాన్ A: ఇరాన్‌ను నాశనం చేయడం
  • ప్లాన్ B: ఇరాన్‌ను ఒంటరిని చేయడం
  • ప్లాన్ C: పాకిస్తాన్‌ను దూరం చేయడం
  • ప్లాన్ D: అలీ ఖమేనీని అంతం చేయడం

ప్లాన్ A…ఇరాన్‌ను నాశనం చేయడం

ఇరాన్‌ను నాశనం చేయడం అంటే.. ఇరాన్ అణు కార్యక్రమాలను, అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని అంతం చేయడం. అసలు 1948లో ఇజ్రాయెల్ పుట్టినప్పుడు.. మద్దతిచ్చిన దేశాల్లో మొదటి దేశం ఇరాన్. తొలినాళ్లలో రెండు దేశాల మధ్య జాన్‌‌జిగ్రీ దోస్తానా నడిచింది. నువ్వు లేక నేను లేను అన్న రీతిలో ఇద్దరి స్నేహం సాగింది. కానీ మతపరంగా రెండు దేశాల మధ్య విభేదాలు రావడంతో.. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ ప్రశ్నించసాగింది. పాలస్తీనియన్ల భూభాగాన్ని ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమిస్తోందని ఇరాన్ ఆరోపిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్‌తో నేరుగా సరిహద్దులు లేనప్పటికీ దాని పొరుగు దేశాలైన లెబనాన్, సిరియా, పాలస్తీనాలను ఇరాన్‌పై ఎగదోసింది. దీనికంతటికీ కారణం…ఖమేనీ వంశస్థులేనని ఇజ్రాయెల్ భావించింది.

అందుకే ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని నాశనం చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే డైరెక్ట్ గా అటాక్ చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ అణుకార్యక్రమాలను బూచిగా చూపి.. ఆ దేశానికి మద్దతుగా ఉన్న తోకలను కట్ చేసి.. అప్పుడు ప్లాన్‌Aను అమలు చేయాలని భావించింది. అయితే ప్లాన్ A సక్సెస్‌ చేసేందుకు ప్లాన్ -Bని రెడీ చేసింది.

ప్లాన్-B ఇరాన్‌ను ఒంటరిని చేయడం

మద్య ప్రాచ్యంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన దేశం. దానికున్న సహజవనరులు ఆదేశాన్ని అజేయశక్తిగా మార్చాయి. అంతేకాదు తనకు నీడలా ఉండి.. కష్టమొచ్చినప్పుడు తనకు రక్షణ గోడగా ఉండేందుకు.. కొన్ని సంస్థలను పెంచి పోషించింది. అవే హిజ్బుల్లా, హూతీ, హమాస్, మిలిషియా గ్రూప్‌లు. వీటికి ఇరాన్‌తో నేరుగా సంబంధాలుండవు. పరోక్షంగా ఆర్ధిక, సైనిక, ఆయుధ సహకారం అందిస్తూ వస్తోంది. ఇరాన్ స్కెచ్‌లో భాగంగానే.. ఇవి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతుంటాయి. ఇది గ్రహించిన ఇజ్రాయెల్.. ముందు ఈ తోకలను కట్ చేసింది. హమాస్, హిజ్బొల్లా, హుతీ, మిలిషియా అంతు చూసింది. IDF దాడులతో కోరల్లేని పాముల్లా మారిపోయాయి ఈ సంస్థలు. ఇప్పుడు పెద్దన్న ఇరాన్ ఇబ్బందుల్లో ఉన్నా సాయం చేయలేని స్థితిలో తమ్ముళ్లున్నారు. సో.. ప్లాన్‌Bని సక్సెస్‌ఫుల్‌గా ముగించింది ఇజ్రాయెల్..

ప్లాన్ C – పాకిస్తాన్‌ను దూరం చేయడం

ఇరాన్‌కు జాన్‌‌జిగ్రీ దోస్త్ పాకిస్తాన్. ఇద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా బ్రొమాన్స్ విచ్చలివిడిగా నడిచింది. ఇరాన్ వద్ద వార్ హెడ్‌లు ఉన్నా.. న్యూక్లియర్ బాంబులు లేవు. ఎప్పుడు కష్టమొచ్చినా.. న్యూక్లియర్ బాంబును సంధించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంటుందని ఇరాన్ నమ్మకం. నమ్మకమే కాదు.. బహిరంగంగా ప్రకటించింది కూడా. కానీ ఇజ్రాయెల్ స్కెచ్‌లో పాకిస్తాన్‌ను అమెరికాకు దగ్గర చేసింది. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ అసిఫ్ మునీర్‌ను పిలిపించుకుని.. వైట్‌ హౌస్ విందు ఇచ్చింది. వాణిజ్య ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ముందరి కాళ్లకు బందం వేసి.. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మార్చింది ఇజ్రాయెల్. ఇది ఇరాన్‌ ఊహించలేకపోయింది.

ప్లాన్ D: అలీ ఖమేనీని అంతం చేయడం

ఇప్పుడు ఇరాన్‌కు మద్దతిచ్చేందుకు ఏదేశాలు ముందుకు రావట్లేదు. అంటే.. ఇప్పుడు ఇరాన్ ఒంటరి. ఆర్ధికంగానూ, ఆర్మీ పరంగా ఏ కంట్రీ అమెరికాను కాదని ఇరాన్‌కు సపోర్ట్‌గా నిలిచే పరిస్థితి లేదు. ప్లాన్ ఏ, బీ, సీ ద్వారా ఇరాన్ చుట్టూ ఉన్న కంచుకోటలను బద్దలు కొట్టి.. అలీ ఖమేని కథ ముగించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరో 48గంటల్లో బిగ్ డెసిషన్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్‌ యూఎన్‌లో చర్చించింది. యుద్ధం వల్ల తానేం చేయబోతున్నామనే విషయాన్ని స్పష్టంగా యూఎన్‌కు వవరించినట్లు తెలుస్తోంది. అంటే ఇరాన్‌ను దెబ్బకొట్టేవరకు ఇజ్రాయెల్‌ విశ్రమించదు.

మరోవైపు అమెరికా కూడా ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నా.. అలీ ఖమేనిని ఖతం చేయాలన్న దానిపై మాత్రం రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అంటే రాబోయే 48గంటల్లో బిగ్‌ బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్ అయితే రాబోతోంది. ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో ఫ్లయింగ్ పెంటగాన్‌ గా పిలిచే డూమ్స్‌డే ప్లేన్ ల్యాండ్ అయింది. ట్విన్ టవర్స్ కూలిన తర్వాత అమెరికా వ్యూహాత్మక రక్షణ విమానం గాల్లో ఎగరడం ఇదే తొలిసారి. అంటే 48గంటల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. మరి ఆఫ్టర్ 48 అవర్స్.. ఏం జరగబోతోంది..? అన్న ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూస్తోంది అంతర్జాతీయ సమాజం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..