Viral Video: మంచు నీటిలో చిక్కుకున్న కుక్క… కాపాడిన పోలీసు ఆఫీసర్లు.. వీడియో వైరల్..

|

Dec 12, 2021 | 4:24 PM

Viral Video: ప్రపంచంలోని అనేక దేశాల్లో డిసెంబర్ నెలలో మంచు వర్షాలు కురుస్తాయి. ఓ వైపు క్రిస్మస్ వేడుకలను రెడీ అవుతూనే.. మరోవైపు మంచు వర్షాన్ని..

Viral Video: మంచు నీటిలో చిక్కుకున్న కుక్క... కాపాడిన పోలీసు ఆఫీసర్లు.. వీడియో వైరల్..
Spanish Police
Follow us on

Viral Video: ప్రపంచంలోని అనేక దేశాల్లో డిసెంబర్ నెలలో మంచు వర్షాలు కురుస్తాయి. ఓ వైపు క్రిస్మస్ వేడుకలను రెడీ అవుతూనే.. మరోవైపు మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తారు అక్కడ ప్రజలు. అయితే ఒకొక్కసారి మంచు వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. నీరు గడ్డకడుతుంది, సెలయేర్లు నదీనదాలు ఘనీవిస్తాయి. అలా నీరు గడ్డకట్టిన రిజర్వాయర్ లో కుక్క చిక్కుకుంది. ఇది చూసిన పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ ఆ కుక్కని కాపాడారు. యురేపియన్ దేశమైన స్పెయిన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఐరోపా ఖండంలోని దేశాల్లో స్పెయిన్ ఒకటి . గత కొన్ని రోజులుగా స్పెయిన్ లో నిరంతరం మంచు తుఫాను కురుస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో 50 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి మంచు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఓ వైపు క్రిస్మస్ వేడుకలకు రెడీ అవుతూనే మరోవైపు మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా స్పెయిన్ లోని గ్వార్డియా కి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు మంచులా గడ్డకట్టిన రిజర్వాయర్ లోని నీటిలో  చిక్కుకున్న ఓ కుక్కని కాపాడారు. కుక్కని రిజర్వాయర్ నుంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి పోలీసు అధికారులు చల్లటి నీటిలోకి వెళ్లారు. దీంతో పోలీసు అధికారుల సహాయం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇదే విషయంపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. తూర్పు స్పెయిన్‌లోని ఆరగాన్‌లోని కాన్‌ఫ్రాంక్‌లోని రిజర్వాయర్‌లో కుక్క చిక్కుకుంది. ఆ కుక్క ఒడ్డుకు రాలేక ఇబ్బంది పడుతుంటే.. రెస్క్యూ టీమ్ అక్కడకు చేరి.. చలిని, గడ్డకట్టిన మంచుని లెక్కచేయకుండా ఆ కుక్కని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read:   దక్షిణకోస్తాతీరం వెంబడి గాలులు.. రాగాల మూడు రోజులలో ఏపీలో వివిధప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..