Two Heads Lizard-Viral Video: ఇప్పటి వరకూ రెండు తలల పాము, రెండు తలలు చేపల గురించి విని ఉంటారు .లేక వాటిని ప్రత్యక్షంగా కొందరు చూసి ఉంటారు కూడా.. అయితే ఇప్పటి వరకూ ఎవరూ రెండు తలలున్న బల్లిని చూసి ఉండరు… కానీ తాజాగా రెండు తలలున్న ఓ బల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బల్లి ఆస్ట్రేలియాలోని ఓ పార్క్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే..
ఆస్ట్రేలియాలో నీలిరంగు నాలుక బల్లులు సర్వసాధారణం. ఇవి ఇంటి పెరడులో కూడాతరచుగా కనిపిస్తాయి. అయితే మొదటి సారిగా రెండు తలలున్న బల్లి ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ రెండు తలల బల్లిని ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం తమకు అందజేసినట్లు అధికారులు చెప్పారు. అప్పుడు వికృతంగా ఉన్న రెండు తలలున్న బల్లిని చూసి తాము ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ రెండేళ్ల తర్వాత ఈ రెండు తలలున్న లక్కీ వీడియో కాలిఫోర్నియాలోని సరీసృపాల జూ వ్యవస్థాపకుడు జే బ్రూవర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వావ్ ఇది నమ్మశక్యం కానిది. అయితే ఇది ఒక అద్భుతం అంటూ ఓ కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశారు.
ఈ వీడియోలో లక్కీకి రెండు తలలు, మూడు కళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తలలు మధ్యలో మూడవ కన్ను ఉంది. అయితే బయటి రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అరుదైన బల్లిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ బల్లిని రక్షించడానికి పార్క్ అధిపతి ఆస్ట్రేలియన్ రెప్టైల్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. అంతేకాదు ఈ రెండు తలల బల్లికి లక్కీ అని పేరు పెట్టారు. ఉత్తమ సంరక్షణ నేపథ్యంలో ఈ బల్లి హ్యాపీగా జీవిస్తుంది. అయితే ఈ బల్లిని అడవిలో వదిలేస్తే.. ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయంపై సరీసృపాల ఉద్యానవనం నిర్వాహకులు స్పందిస్తూ.. ఇలా అంగవైకల్యం ఉన్న జంతువులూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని.. తమని తాము రక్షించుకోవలేవని చెప్పారు. అంతేకాదు ఆహారం సంపాదించుకోవడంలో కూడా ఇబ్బంది పడతాయని అంటున్నారు.
Also Read: భార్య కొట్టిందని ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసు ఓదార్పు వింటే నవ్వులే నవ్వులు..