మనదేశ ఉత్తరాదిలో ఎముకలు కొరికే చలి ప్రతి యేటా పలకరిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి మీరెప్పుడై వెంట్రుకల్ని గడ్డకట్టించే చలి గురించి విన్నారా? అదేంటీ వెంట్రుకలు కూడా గడ్డకడతాయా? అని సందేహిస్తున్నారా? అవునండీ.. ఢిల్లీ కంటే ఎన్నో రెట్లు చలి ఎక్కువగా ఉండే స్వీడన్ గురించే మనం చర్చిస్తోంది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఓ యువతి ఆరుబయటకు రాగా చలి తవ్రతకు ఆమె జుట్టు గడ్డకట్టి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
స్వీడన్‌లో ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. అక్కడ ఉత్తర స్వీడన్‌లో 30 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో ప్రముఖ స్వీడిష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్‌గ్రెన్ బయటికి వచ్చింది. కాసేపటికే ఆమె జుట్టు మంచు కిరీటంలా గడ్డకట్టుకుపోయి నిటారుగా నిలబడింది. గడ్డకట్టుకుపోయిన తన వెంట్రులకను తలపై కిరీటంలా ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ వాతావరణంలో చిన్న ప్రయోగం చేశాను అనే శీర్షికతో ఆమె వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గడ్డ కట్టిన తన తల వెంట్రుకలను వెనక్కి, ముందుకు ఆడిస్తూ ఎంజాయ్ చేయడం కనిపిస్తుంది.
కాగా స్వీడెన్‌లో బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆ రోజున మైనస్ 43.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదు అయ్యింది. స్వీడెన్‌లో 1999 తరువాత జనవరిలో ఇదే అతి శీతల వాతారణం అని స్వీడన్ జాతీయ వాతావరణ సంస్థ (SMHI) సైంటిస్ట్ మాట్యాస్ లిండ్ పేర్కొన్నారు. 1999లో మైనస్ 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. 1888 నుంచి రికార్డైన మెజర్‌మెంట్స్‌ను పరిశీలిస్తే ఇదే అత్యంత అల్ప ఉష్ణోగ్రతగా ఆయన చెప్పారు. ఉత్తర స్వీడన్‌లోని అనేక ప్రాంతాల్లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక చలి కారణంగా అక్కడి రైలు సర్వీసులు, బస్సులను రద్దు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.