ఫ్లోరిడా, అక్టోబర్ 17: డైపర్‌ని చూసి బాంబ్ అనుకుని విమానంలో ప్రయాణికులంగా హడలెత్తిపోయారు. విమానం గాల్లో ఉండగానే విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులకు భయంతో ఊపిరాగినంత పనైంది. దెబ్బకు ఫ్లైట్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేయించారు. తీరా బాంబ్ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేయగా అది వుత్తి డైపర్ మాత్రమే అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విచిత్ర సంఘటన అమెరికాలోని కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గత శుక్రవారం (అక్టోబర్ 13) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కోపా ఎయిర్‌లైన్స్ విమానం పనామా సిటీలోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత శుక్రవారం (అక్టోబర్ 13) టంపా మీదుగా ఫ్లోరిడాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత ఫ్లైట్ టాయిలెట్‌లో ఓ అనుమానాస్పద వస్తువును సిబ్బంది గుర్తించారు. అది అనుమానాస్పదంగా ఉండటంతో బాంబుగా భావించిన సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానంలోని ప్రయాణికులు భయంతో గజగజలాడిపోయారు. అనంతరం విమానాన్ని తిరిగి పనామాకు తిరిగి వచ్చింది.
El Subcomisionado José Castro, Jefe del Departamento de Seguridad Aeroportuaria de la Policía Nacional dentro del @TocumenAereo, brinda declaraciones sobre la presencia de un pañal desechable envuelto en una bolsa de color negra dentro del baño de una aeronave. pic.twitter.com/qWKcQPTViq
— Policía Nacional (@ProtegeryServir) October 13, 2023
విమానం పనామా టోకుమెన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవగానే బాంబ్ స్క్వాడ్ గాలింపు చేపట్టింది. ఫ్లైట్‌లో ఉన్న మొత్తం 144 మంది ప్రయాణికుల్ని కిందకు దింపే విమానం ఖాళీ చేయించారు. అనంతరం యాంటీ-ఎక్స్‌ప్లోజివ్స్ టీం, ఎయిర్ పోర్ట్ భద్రతా దళం విమానంలో సోదాలు నిర్వహించారు. విమానంలోని టాయిలెట్‌లో అనుమానాస్పదంగా ఉన్న వస్తువును పరిశీలించి చూడగా అది అడల్ట్ డైపర్‌గా గుర్తించారు. అనంతరం విమానంలో పేలుడు పదార్థాలేమీ లేవని నిర్ధారించింది. ఈ మేరకు ఓ భద్రతా అధికారి మాట్లాడుతూ.. ‘మేము విమానం సురక్షితంగా రన్‌వేలో ల్యాండ్ చేశాం. అక్కడ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ టీం విమానాన్ని పరిశీలించాయి. అది పెద్దల డైపర్‌గా గుర్తించారు. ప్రమాదకర వస్తువులేవీ విమానంలో కనుగొనబడలేదని’ విమానాశ్రయ భద్రతా బృందం అధిపతి జోస్ కాస్ట్రో తెలిపారు. అనంతరం ప్రయాణికులు విమానంలో ప్రయాణానికి అనుమతించారు. దీంతో ఆ విమానం కొంత ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది. ఈ ఘటన విమానాశ్రయంలో గందరగోళానికి గురిచేసింది.
మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.