ఆ మధ్య ఢిల్లీ మెట్రో రైల్‌లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రైల్లలో ఇలా వింతగా చేసే పనులు వారిని సెలబ్రెటీలుగా చేస్తోంది. ఐతే ఓ యువకుడు ఫేమస్ అవ్వాలనుకున్నాడో లేదా పాపం ఆ మాత్రం టైం లేక చేశాడో తెలీదుగానీ కదులుతున్న ట్రైన్‌లో అందరి ముందే బహిరంగంగా బట్టలు విప్పి తాజీగా స్నానం చేశాడు. ఆ తర్వాత చక్కగా వేరే బట్టలు ధరించి తన స్టేషన్‌లో దిగిపోయాడు. అమెరికాలోని న్యూ యార్క్ సిటీ సబ్వే ట్రైన్‌లో చోటుచేసుకున్న ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
న్యూయార్క్ సిటీ రైలు కోచ్‌లోని ఓ కంపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌తో ఎక్కి కూర్చున్నాడు. కాసేపటి తర్వాత కాళ్ల షూస్, ప్యాంట్, షర్ట్‌లను తీసివేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే తనతోపాటు తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి, చిన్ని వాటర్ క్యాన్‌లో ఉన్న నీళ్లను బ్యాగ్‌లో పోస్తాడు. పసుపు రంగులో ఉన్న స్పాంజిపై షాంపు వేసుకుని హాయిగా స్నానం చేయడం వీడియోలో చూడొచ్చు. ఆ వ్యక్తిని చూసి కొంతమంది ప్రయాణికులు నవ్వుతూ కనిపిస్తే, మరికొందరేమో బిత్తరపోయి అక్కడి నుంచి లేచి వేరే చోటికి వెళ్లి కూర్చొవడం వీడియోలో చూడొచ్చు. ఇది పాత వీడియో అయినప్పటికీ 15 మిలియన్ వీక్షణలు, లక్షల్లో కామెంట్లు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో మళ్లీ వైరల్ అయ్యింది. ‘ఇతనికి ఎంత ధైర్యం.. ఎవరైనా పబ్లిక్ ట్రైన్‌లోనే స్నానం చేస్తారా?’, ‘ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఈ తరం ముర్ఖంగా ప్రవర్తిస్తోందని’ పలువురు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.