Viral Video: సలామ్ రైతన్న.. వరదలో చిక్కుకున్న చిన్నారులు.. డ్రోన్‌తో రెస్క్యూ.. ఇదిగో వీడియో!

డ్రోన్‌లను సాధారణంగా ఎందుకు ఉపయోగిస్తాం.. ఫోటో షూట్స్‌, వీడియో షూట్స్‌ చేయడానికి వినియోగిస్తాం.. ఈ మధ్య కాలంలో కొన్ని డ్రోన్స్‌ను పొలాల్లో మందులు కొట్టడానికి కూడా వినియోగిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ రైతు తన డ్రోన్‌ను వినియోగించే ఏకంగా వరదలో చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడాడు. డ్రోన్‌తో ఎలా కాపాడాడు అనుకుంటున్నారా?.. అయితే తెలుసుకుందాం పదండి.

Viral Video: సలామ్ రైతన్న.. వరదలో చిక్కుకున్న చిన్నారులు.. డ్రోన్‌తో రెస్క్యూ.. ఇదిగో వీడియో!
Drone

Updated on: Jul 07, 2025 | 3:15 PM

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మానవుడు కొత్తకొత్త వింతలను సృష్టిస్తున్నాడు. యంత్రాలను తయారు చేసి పనిభారం తగ్గించడంతో పాటు.. మనుషులు చేయలేని పనులను కూడా వాటితో చేయిస్తున్నాడు. ఇందులో భాగంగానే మనిషి తయారు చేసిన ఓ పరికరం ఇప్పుడు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించింది. పశువులను మేపుతూ నది దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులు అనుకోకుండా వరదలో చిక్కుకున్నారు. అది గమనించిన ఓ రైతు తన దగ్గరున్న వ్యవసాయ డ్రోన్‌ సహాయంతో వదరలో చిక్కుకున్న చిన్నారులను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ ఘటన వియత్నాంలోని గియాలై రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇయా తుల్ కమ్యూన్‌కు చెందిన ఓ ముగ్గురు చిన్నారులు ఈ నెల 3వ తేదీనా పశువులను మేపుతూ వెళ్తుండగా వాళ్లకు ఓ నది అడ్డు వస్తుంది. మొదట ఆ నదిలో నీరు అంతంత మాత్రానే ఉంటుంది. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు నదిని దాటేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారు నది మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం ఎక్కవై వాళ్ల చుట్టూ నీరు చేరుతుంది. దీంతో ఆ ముగ్గురు చిన్నారులు నది మధ్యలోని ఒ మట్టిదిబ్బపైకి ఎక్కి నిల్చుంటారు.

వీడియో యూడండి..

అయితే, నీటిలో చిక్కుకున్న చిన్నారులను గమనించిన స్థానికులు సహాయం కోసం పక్కవారిని పిలిచారు. పక్కనే తన పొలంలో పంటకు పిచుకారి చేస్తున్న ఓ రైతు స్థానికుల అరుపులు విని స్పందించాడు. వాళ్ల దగ్గరకు వచ్చి చూడగా చిన్నారులు నదిలో చిక్కుకుపోయినట్టు గమనించాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే తను పిచుకారి చేసేందుకు తీసుకువచ్చిన డ్రోన్‌ను తీసుకొని దానికి బలమైన తాడును.. ఆ డ్రోన్‌ను చిన్నారులు ఉన్న స్థలానికి పంపాడు. ఆ తాడు సహాయంతో ఒక్కొక్కరిగా ఇద్దరు చిన్నారులను ఒడ్డుకు చేర్చాడు. స్థానికుల సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న రెస్క్యూ అధికారులు పడవ సహాయంతో నదిలోకి వెళ్లి మూడో చిన్నారిని రక్షించారు.

ఈ సందర్భంగా సదురు రైతు మాట్లాడుతూ తన డ్రోన్ 50 కిలోల వరకు బరువును మోయగలదని.. అందుకే పిల్లలను రక్షించేందుకు డ్రోన్‌ను రంగంలోకి దించానని తెలిపాడు. ఈదుతూ వెళ్లి కాపాడుదా మంటే నీటి ప్రవాహం ఎక్కువగా.. ఉందని అలా వెళ్లి కాపాడటం సాధ్యం కాదని తెలిసే డ్రోన్‌ ద్వారా పిల్లలను రక్షించినట్టు చెప్పుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.