Viral Video: నది మధ్యలో ట్రైన్‌.. ఊహించని రీతిలో భారీ అగ్నిప్రమాదం.. షాకింగ్ వీడియో..

|

Jul 23, 2022 | 5:31 AM

Viral Video: అమెరికాలోని బోస్టన్ శివార్లలోని మిస్టిక్ నదిపై నిర్మించిన వంతెనపై ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వంతెన మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో..

Viral Video: నది మధ్యలో ట్రైన్‌.. ఊహించని రీతిలో భారీ అగ్నిప్రమాదం.. షాకింగ్ వీడియో..
Accident
Follow us on

Viral Video: అమెరికాలోని బోస్టన్ శివార్లలోని మిస్టిక్ నదిపై నిర్మించిన వంతెనపై ఘోర రైలు ప్రమాదం సంభవించింది. వంతెన మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో భారీగా మంటలు వచ్చాయి. దాంతో ప్రయాణికులు ప్రాణభయంతో.. రైలు నుంచి నదిలోకి దూకేశారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు ముందు భాగం కోచ్‌ల నుంచి మంటలు చెలరేగడంతో పాటు.. ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ కమ్ముకుంది. దాదాపు 200 మంది రైలు నుంచి బయటకు దిగారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MBTA) ప్రకారం.. ‘‘వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆరెంజ్ లైన్ రైలు హెడ్ కార్ నుండి మంటలు, పొగలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. ప్రయాణికులను అలర్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉండగా.. రైలులో మంటలు వ్యాపించిన సమయంలో.. పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో ప్రయాణికులు భయడిపోయారు. దాంతో చాలా మంది ప్రయాణికులు రైలు కిటికీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొందరు అలాగే ట్రైన్ కిటికీ నుంచి కిందకు దూకేశారు. ఓ మహిళ మిస్టిక్ నదిలోకే దూకేసింది. మొత్తానికి ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..