సినిమాను తలపించేలా జీవితం.. ఆఫ్ఘన్‌ను వదిలి ఉక్రెయిన్‌కు.. ఇప్పుడు అక్కడి నుంచి పోలాండ్‌‌కు

|

Feb 28, 2022 | 9:40 PM

కొంతమంది జీవితాలను చూస్తే జాలి చూపడం తప్ప ఏమీ చేయలేము. అలాంటి వ్యక్తే ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అజ్మల్‌. సినిమాను తలపించేలా ఉంది ఆయన జీవితం.

సినిమాను తలపించేలా జీవితం.. ఆఫ్ఘన్‌ను వదిలి ఉక్రెయిన్‌కు.. ఇప్పుడు అక్కడి నుంచి పోలాండ్‌‌కు
Very Bad Luck
Follow us on

Ukraine War: చాలా మంది చిన్నచిన్న విషయాలకే టైమ్‌ బాలేదు, అదృష్టం బాలేదు అనుకుంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)కు చెందిన అజ్మల్‌ రెహమాని కథ వింటే, మనమెంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. యుద్ధ భయంతో కట్టుబట్టలతో సొంత దేశాన్ని వీడాల్సి రావడం ఎంతో దయనీయం. అటు వలస వెళ్లిన దేశంలోనూ అదే పరిస్థితి ఎదురై, మరోసారి అన్నింటిని వదిలి, పొట్టచేత పట్టుకొని మరో దేశానికి వెళ్లడం ఇంకెంత దారుణం. అచ్చం అలాంటి పరిస్థితే ఈ అజ్మల్‌ రెహమానీది. అతని సొంత దేశం ఆప్ఘనిస్థాన్‌. 20 ఏళ్ల తర్వాత అమెరికా బలగాలు ఆఫ్ఘన్‌ను వదిలి వెళ్లడంతో, మరోసారి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు తాలిబన్లు(Taliban). ఇది జరగడానికి నాలుగు నెలల ముందే రెహమాని ఆఫ్ఘనిస్థాన్‌ వదిలి ఉక్రెయిన్‌ వెళ్లాడు. అప్పట్లో తనకు ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించిన ఏకైక దేశం ఉక్రెయినే. ఇప్పుడా దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా దాడితో మరోసారి భయాందోళనలకు గురైన రెహమాని, తన కుటుంబంతో సహా ఉక్రెయిన్‌ వదిలి ఇప్పుడు పోలాండ్‌ చేరుకున్నాడు. అక్కడ తనను పలకరించిన వారితో తన బాధను చెప్పుకున్నాడు రెహమాని. ఓ యుద్ధం నుంచి తప్పించుకొని మరో దేశానికి వచ్చానని, ఇక్కడా యుద్ధం మొదలైందని చెప్పాడు రెహమాని. ఇది చాలా దురదృష్టం అని వాపోతున్నాడు రెహమాని. ఉక్రెయిన్‌ రాకముందు, అతడు ఆఫ్ఘనిస్థాన్‌లో నాటోకు పనిచేసేవాడు. ఆ సమయంలో అతని జీవితం బాగానే ఉండేది. ఓ ఇల్లు, కారు, మంచి జీతం.. ఇలా సాఫీగా సాగిపోయేది. ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘన్‌ నుంచి దళాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించిందో, అప్పటి నుంచి రెహమాని జీవితం తలకిందులైంది. ఇదిగో ఇలా రోడ్డున పడేసింది.

Also Read:  ఏటా దగ్ధమవుతున్న గడ్డివాము.. సీక్రెట్‌గా సీసీ కెమెరాలు అమర్చిన బాధితుడు.. ఫుటేజీలో షాకింగ్ సీన్