Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

|

Feb 25, 2022 | 1:07 AM

Joe Biden: రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక ప్రకటన చేశారు.

Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..
Follow us on

Joe Biden: రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక ప్రకటన చేశారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపారు. యూఎస్‌ పెట్టుబడిదారుల నుంచి రష్యాకు ఫండ్‌ రైజింగ్‌ను నిలిపివేస్తామన్నారు. 4 బ్యాంకుల లావాదేవీలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు.. అదేవిధంగా250 బిలిలయన్‌ డాలర్ల వీటీబీ బ్యాంక్‌ (రష్యన్‌ ప్రభుత్వ బ్యాంకు) ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 3 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులను కూడా సీజ్‌ చేస్తామన్నారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అనుసరిస్తోన్న వైఖరికి వ్యతిరేకంగా రేపు (ఫిబ్రవరి 26) 30 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు అమెరికా అధినేత తెలిపారు. కాగా ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా ఉంటామని బైడెన్‌ భరోసా ఇచ్చారు. అయితే రష్యాతో యుద్ధానికి తమ బలగాలను పంపించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మోడీతో మాట్లాడతాను..
‘ఉక్రెయిన్‌పై దాడికి రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదు. యుద్ధం వల్ల తలెత్తే పర్యావసనాలు పుతిన్‌ పట్టించుకోవడం లేదు. రష్యా యుద్ధాన్ని ఆపకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తాం. ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీతో పాటు స్పేస్ రీ ప్రోగ్రాంను నిర్వీర్యం చేస్తాం. మా మిత్ర దేశాలతో మాట్లాడి రష్యాకు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేయిస్తాం.  రష్యా వైఖరిపై భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ తో కూడా మాట్లాడతాం.. ఇక అమెరికాపై రష్యా సైబర్‌ దాడులు జరుపుతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం ‘ అని బైడెన్‌ తెలిపారు. కాగా అంతకుముందే ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించి జో బైడెన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ఈ ఉదయాన్నే జీ 7 దేశాల మిత్రులను కలిశాను. పుతిన్‌ అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని మేం నిర్ణయించుకున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.

Also Read:Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. భారత్ వైఖరి వెనుక వ్యూహం ఇదేనా..?