ఏమో అనుకున్నాం గానీ అమెరికాలో పెద్ద అల్లకల్లోలమే జరుగుతోంది. ఇకపై అమెరికాలో అంత ఈజీగా అడుగు పెట్టలేరు. ఆల్రెడి ఉన్న వాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. అమెరికాలో పిల్లలను కనాలో, కనకూడదో క్లారిటీ లేదు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్స్‌తో అమెరికాకు వెళ్తున్నా సరే.. ఎయిర్‌పోర్ట్ నుంచే తిరుగుముఖం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక.. లక్ష మంది తెలుగు వాళ్ల గుండెలు హైస్పీడ్‌తో కొట్టుకుంటున్నాయి. కనీసం ఏడున్నర లక్షల మంది భారతీయులు.. ఇక అమెరికాతో అనుబంధం వీడినట్టేనని భయంభయంగా బతుకుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై సియాటెల్ కోర్టు తాత్కాలిక స్టే విధించినా సరే.. ఆ గుబులు మాత్రం పోవడం లేదు. డెలివరీకి ఇంకా రెండు నెలల సమయం ఉన్నా సరే.. ఈలోపే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎవరూ ప్రశాంతంగా లేరు. అంతలా అల్లకల్లోలం సృష్టించారు ట్రంప్. ట్రంప్ తెంపరితనాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికాలో వలసదారుల కష్టాలు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే దారుణంగా ఉన్నాయనేది మాత్రం పక్కా..! ఒకరు హెచ్1బీ వీసాతో అమెరికాలో ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. జనరల్‌గా క్యాబ్ బుక్ చేసుకునో, అక్కడి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌తోనో ఇంటికెళ్లొచ్చు అనుకున్నాడు. కానీ.. ఊహించని విధంగా ‘కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్-CBP’ అధికారులు వచ్చి డిటెన్షన్ సెంటర్‌కి తీసుకెళ్లారు. అదేమంటే.. ఎంక్వైరీ చేయాలన్నారు. ‘సరే, ఎంక్వైరీ చేయండి, కాని చేతులకు బేడీలు ఎందుకు వేశారు’ అని అడగాలనుకున్నాడు ఆ వ్యక్తి. కాని...