అమెరికా అతలాకుతలం.. స్తంభించిన ప్రధాన నగరాలు.. 10 వేల విమాన సర్వీసులు రద్దు..!

అమెరికాను మంచు తుఫాన్‌ అతలాకుతలం చేస్తుంది. న్యూయార్క్‌ నగరం మొదలు మసాచుసెట్స్‌ దాకా అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది. రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్క్‌లు, మైదానాలు ఇలా ఎక్కడ చూసినా అంతెత్తున మంచు పేరుకుపోయింది.

అమెరికా అతలాకుతలం.. స్తంభించిన ప్రధాన నగరాలు.. 10 వేల విమాన సర్వీసులు రద్దు..!
Massive Snowstorm Hits Us

Updated on: Feb 24, 2026 | 8:50 AM

అమెరికాను మంచు తుఫాన్‌ అతలాకుతలం చేస్తుంది. న్యూయార్క్‌ నగరం మొదలు మసాచుసెట్స్‌ దాకా అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది. రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్క్‌లు, మైదానాలు ఇలా ఎక్కడ చూసినా అంతెత్తున మంచు పేరుకుపోయింది. ఇటు న్యూజెర్సీలోని మౌంట్ హోలీ ప్రాంతాల్లో 20 అంగుళాల మేర మంచు కురిసింది. ఫిబ్రవరి నెలలో ఈ స్థాయిలో మంచు పడటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.

మంచు తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షలాది కుటుంబాల్లో అంధకారం అలుముకుంది. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చు’’అంటూ విద్యుత్‌ సిబ్బంది చేతులెత్తేశారు. ఇక మంచు తుఫాన్ కారణంగా దాదాపు 10 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

టేనస్సీ, మిస్సిస్సిప్పి, టెక్సాస్, లూసియానా, కెంటుకీ, జార్జియా, వర్జీనియా, అలబామా వంటి ఇతర రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు దొరకక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు 20 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.. వీధుల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు స్నో మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us