
ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. ఇరాన్‌లోని హార్మోజ్‌గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాల ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో సుమారు 85 మంది వరకు బాలికలు మరణించినట్టు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. అలాగే మరో 45 మందికిపైగా గాయపడినట్లు తెలిపింది. దాడి సమయంలో పాఠశాలలో సుమారు 170 మంది బాలికలు ఉన్నట్టు స్థానిక మీడియాలు తెలిపాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్ గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించాయని వారందరికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. ఈ కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ దాడిని ఇరాన్ సైతం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో అభం శుభం తెలియని చిన్నారులు చనిపోయారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇరాన్ కూడా దీనికి కౌంటర్‌గానే ఇజ్రాయెల్, అమెరికాపై దాడులు ప్రారంభించింది. ఏకంగా 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఒకేసారి 10 దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్,కువైట్ , బహ్రేయిన్ , సౌదీ అరేబియా , జోర్డాన్ , కువైట్ ,ఇరాక్ ,ఖతార్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.