అమెరికాతో టారిఫ్ వార్…చైనా వార్నింగ్ !

|

Jun 07, 2019 | 12:40 PM

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొల్ల) విదేశీ కంపెనీల పేర్లను బయటపెడతామని ఈ శాఖ తెలిపింది. చైనా ఎగుమతులపై తాము మరో 300 […]

అమెరికాతో టారిఫ్ వార్...చైనా వార్నింగ్  !
Follow us on

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొల్ల) విదేశీ కంపెనీల పేర్లను బయటపెడతామని ఈ శాఖ తెలిపింది. చైనా ఎగుమతులపై తాము మరో 300 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను విధిస్తామంటూ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో బీజింగ్ కూడా ఇందుకు దీటుగా కౌంటర్ ఇచ్చింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి ఇన్నేళ్ళుగా తమ కో-ఆపరేషన్ కారణంగా ఆ దేశం ఎలా ప్రయోజనం పొందిందో వివరిస్తూ చైనా ప్రభుత్వం ఓ నివేదికను ప్రచురించింది. సుంకాల విషయంలో యుఎస్ తో తామేమీ పోరాటాన్ని కోరడంలేదని, అయితే అదే సమయంలో భయపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే కౌంటర్ చర్యలు తీసుకోవడానికి, మా దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి రెడీగా ఉన్నామని తెలిపింది. చైనాకు చెందిన ‘ హువాయ్ టెక్నాలజీస్ ‘ సంస్థ మేధో సంపత్తి హక్కులను దొంగిలించిందని, ఇరాన్ విధించిన ఆంక్షలను తొక్కిపెడుతోందని, అందువల్ల ఈ సంస్థను బ్లాక్ లిస్టులో పెడుతున్నామంటూ అమెరికా చేసిన హెచ్చరికను చైనా తీవ్రంగా పరిగణించింది. ఇలా అయితే మేం కూడా అమెరికాకు చెందిన డొల్ల కంపెనీల పేర్లను విడుదల చేస్తామని పేర్కొంది. గత ఏడాది మార్చిలో చైనా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియం వస్తువుల మీద ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచింది. అప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ మొదలైంది. యుఎస్ నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న కోట్లాది డాలర్ల విలువైన సరకులపై చైనా సైతం పెద్దఎత్తున టారిఫ్ పెంచుతూ వచ్చింది. కాగా… ఈ దేశాల మధ్య పెరుగుతున్న టారిఫ్ వార్ ఇండియాతో బాటు కొన్ని వర్ధమాన దేశాలకు వరంగా మారనుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. అయితే అటు భారత్ పై కూడా ట్రంప్ ప్రభుత్వం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాను ట్రంప్ టారిఫ్ కింగ్ గా అభివర్ణించాడు. అలాగే ఇండియానుంచి తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులమీద సుంకాలను పెంచాడు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకోకపోవడం విడ్డూరం.