Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

|

Apr 08, 2022 | 1:12 AM

Russia Suspended: ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ తగిలింది. UN-HRC నుంచి రష్యాను తొలగించారు. ఐరాస మానవ హక్కుల మండలి..

Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!
Follow us on

Russia Suspended: ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ తగిలింది. UN-HRC నుంచి రష్యాను తొలగించారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా (Russia)ను తొలగించడంపై ఓటింగ్‌ నిర్వహించగా..  మొత్తం 193 సభ్య దేశాలున్న సాధారణ అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి. రష్యాకు అనుకూలంగా కేవలం 24 దేశాలు మాత్రమే ఓట్లు వేశాయి. భారత్‌ సహా 58 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. శాంతి వైపు తాముంటామని భారత్ ప్రతినిధి స్పష్టం చేశారు. చర్చల ద్వారానే శాంతి స్థాపన సాధ్యమన్నారు. ఏ రూపంలోను హింస ఆమోదయోగ్యం కాదన్నారు. దీంతో అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్‌ నుంచి ఒక దేశం సస్పెండ్‌కు గురికావడం ఇది రెండోసారి. 2011లో మొదటిసారిగా లిబియా సస్పెండ్ కగా, ఇప్పుడు రష్యాకు ఎదురైంది. ఇక ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకువడంతో ఉక్రెయిన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

ఉక్రెయిన్‌లోని బుచా ప‌ట్టణంలో ర‌ష్యా బ‌ల‌గాలు పౌరుల ఊచ‌కోత‌కు పాల్పడ్డాయ‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. మృత‌దేహాల‌ను సామూహికంగా ఖ‌న‌నం చేసిన దృశ్యాలు వెలుగు చూశాయి. బుచా పట్టణంతో పాటు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ తదితర పట్టణాలు, నగరాల్లోనూ రష్యా బలగాలు సామాన్య ప్రజలను చంపేసినట్లు ఆధారాలు లభించాయి. కానీ తమ సైనిక బలగాలు ఉక్రెయిన్‌ పౌరులను చంపలేదని రష్యా వాధిస్తోంది. బుచా పట్టణంలో మారణకాండ, ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీంతో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు మరిన్ని ఆంఓలు విధించనున్నాయి. ఉక్రెయిన్‌ పౌరుల మరణాలకు బాధ్యత వహించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

Sanath Jayasuriya: లంకకు భారత్‌ ఆపన్న హస్తం.. మాజీ క్రికెటర్‌ సనత్ జయసూర్య ఏమన్నాడంటే..