Underwears Auction : అప్పు తీర్చలేదని మహిళ లోదుస్తులను వేలానికి పెట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దేశం..

|

Feb 19, 2021 | 4:49 PM

సర్వసాధారణంగా అరుదైన, విలువైన వస్తువులను వేలానికి పెడతారు. ఉక్రెయిన్ లో వేలానికి సరికొత్త అర్ధం చెప్పింది. రుణాలను తిరిగి వసూళ్లు చేయడంలో ఉక్రెయిన్ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది..

Underwears Auction : అప్పు తీర్చలేదని మహిళ లోదుస్తులను వేలానికి పెట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దేశం..
Follow us on

Underwears Auction : సర్వసాధారణంగా అరుదైన, విలువైన వస్తువులను వేలానికి పెడతారు.. ఇక బ్యాంక్ వంటి సంస్థలు ఖాతాదారుల నుంచి తమ అప్పులను రాబట్టుకోవానికి వారి విలువైన వస్తువులను వేలానికి పెడుతుంది. అయితే ఉక్రెయిన్ లో వేలానికి సరికొత్త అర్ధం చెప్పింది. రుణాలను తిరిగి వసూళ్లు చేయడంలో ఉక్రెయిన్ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. అక్కడ న్యాయ మంత్రిత్వ శాఖ మహిళల లోదుస్తులను వేలానికి పెట్టి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఉక్రెయిన్ దేశంలో రుణగ్రహీతలు ఎక్కువయ్యారని.. వారు అప్పులు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నారని అక్కడ ప్రభుత్వం ఆరోపితుంది. ఈ నేపథ్యంలో ఋణం తీసుకున్న వ్యక్తుల ఆస్తులను జప్తు చేసుకుని ఆన్‌లైన్లో వేలానికి పెడుతోంది.

సెటమ్ పేరుతో ఏర్పాటుచేసిన వెబ్‌సైట్లో వాటిని వేలానికి పెట్టినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. క్రివి రిహ్‌లో రుణాలను తిరిగి చెల్లించడం లేదనే కారణంతో అధికారులు ఓ మహిళా లోదుస్తులు ఆన్‌లైన్ లో వేలంపాటల కోసం న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ వెబ్‌సైట్‌లో వివిధ రకాలు, రంగులతో ఉన్న లోదుస్తులను పోస్ట్ చేసింది. వేలంలో వీటి ప్రారంభ ధర భారత కరెన్సీ లో రూ. 50 లుగా నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం.  దీంతో ప్రజలు ‘‘ఛీ.. పాడు, ప్రభుత్వం ఇంతగా దిగజారిపోవాలా?  అని తిట్టిపోస్తున్నారు..

అక్కడ ప్రజలు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. గత ఏడాది సుమారు 3 లక్షల మంది రుణాలు తిరిగి చెల్లించలేదు. రుణాలు చెల్లింపులు, వేలం పాటల కోసం అక్కడి ప్రభుత్వం 2015లోనే ‘సెటమ్’ అనే ఓపెన్ మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. వాటి ద్వారానే రుణాలు చెల్లించని వ్యక్తుల వస్తువులను వేలం వేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం 364 మిలియన్ పౌండ్లు (రూ.2641.22 కోట్లు) లభించినట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల కిందట ఓ వృద్ధురాలి పెంపుడు కుక్కను వేలానికి పెట్టి అధికారులు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు వేలంలో ఆవులు మరియు గొర్రెలు కూడా ఉన్నాయి.

Also Read:

బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో 459 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం