కోతి.. అంటే మనందరికీ తెలిసింది కాదండో.. ఇది అత్యంత అరుదైన జాతి కోతి. దీన్ని మకాక్ జాతి అంటారు. ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్ జాతి కోతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌లోని చెస్టర్ జూలో మకాక్ జాతికి చెందిన కోతుల జంటకు ఒక పిల్ల కోతి జన్మించింది. దీంతో అక్కడి సిబ్బంది, అధికారులు సంతోషించదగ్గ పరిణామంగా వెల్లడించారు. అంతరించిపోతున్న కోతి జాతికి చెందిన పిల్ల కోతి తమ జూలో జన్మించడంతో అక్కడి జూ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ జూలో మకాక్ జాతి కోతిపిల్ల జన్మించడం మకాక్ జాతి కోతుల సంరక్షణ కోసం చేపట్టిన గ్లోబల్ బ్రీడింగ్ కార్యక్రమానికి శుభపరిణామమని చెస్టర్ జూ క్షీరదాల విభాగం అధ్యక్షుడు మార్క్ బ్రే షా అన్నారు. మకాక్ జూలో ఈ పిల్లకోతి చేస్తున్న అల్లరి చేష్టలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
ఇండోనేసియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్ జాతి కోతుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కంటే దిగువకు పడిపోయింది. దాంతో ఈ మకాక్ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బ్రిటన్‌లోని చెస్టర్ జూలో మకాక్ కోతి పిల్ల పుట్టడం సంతోషించదగ్గ పరిణామంగా వారు వెల్లడించారు. మకాక్ జూలో ఈ పిల్లకోతి చేస్తున్న అల్లరి చేష్టలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..