UK PM Liz Truss: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌కు పదవీగండం..! అవిశ్వాసానికి ఎంపీల ప్రయత్నాలు..

|

Oct 18, 2022 | 7:14 AM

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం. ప్రధాని లిజ్‌ ట్రస్‌ పన్నుల విధానంపై సర్వత్రా విమర్శలు లొస్తున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలే ట్రస్‌పై అవిశ్వాసం పెడతారంటూ వార్తలొస్తున్నాయి.

UK PM Liz Truss: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌కు పదవీగండం..! అవిశ్వాసానికి ఎంపీల ప్రయత్నాలు..
Liz Truss
Follow us on

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ పదవి మూణాళ్ల ముచ్చటగా మిగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాని పదవి చేపట్టిన ఆరు వారాల్లోనే..ఆమె విధానాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలే..ఆమెను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరవచ్చని ప్రచారం జరుగుతోంది. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులు ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం సమర్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అక్టోబరు 24లోగా ఆమెను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ట్రస్‌ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దివాలా తీసింది. దీంతో పార్టీలో 62శాతం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సొంతపార్టీ కన్సర్వేటివ్‌ సభ్యుల సలహాలతో కొత్త ఆర్థికమంత్రి జెరెమీ హంట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆదాయపు పన్ను సహా ఇతర పన్నులను కత్తిరిస్తూ.. లిజ్‌ ట్రస్‌ సెప్టెంబర్‌ 23న తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు. తద్వారా స్టాక్‌మార్కెట్లను, IMF వంటి సంస్థలను శాంతపరిచే చర్యలు చేపట్టారు.

లిజ్‌ ట్రస్‌ను పదవి నుంచి తొలగిస్తే ఆమె స్థానంలో రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. 2016లో ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలిగిన తర్వాత..ప్రధాని అర్థాంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి అవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..