Rishi Sunak: లిజ్ ట్రేస్ పై రిషి సునాక్ అనూహ్యా విజయం..ఇందులోనే బిగ్ ట్విస్ట్..భారత సంతతి వ్యక్తికి టీవీ ప్రేక్షకుల మద్దతు

రిషీ సునాక్ విజయం సాధించింది ఎన్నికల సమరంలో కాదు. స్కైటీవీ నిర్వహించిన ఓ డిబేట్ లో.. ఈచర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు మాట్లాడిన తర్వాత ఓటింగ్ పెట్టడంతో స్టూడియోలో డిబేట్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఎక్కువమంది రిషీ సునాక్ కు మద్దతు తెలిపారు.

Rishi Sunak: లిజ్ ట్రేస్ పై రిషి సునాక్ అనూహ్యా విజయం..ఇందులోనే బిగ్ ట్విస్ట్..భారత సంతతి వ్యక్తికి టీవీ ప్రేక్షకుల మద్దతు
Rishi Sunak Liz Truss
Amarnadh Daneti

|

Aug 05, 2022 | 6:41 PM

Rishi Sunak Surprises: కాబోయే బ్రిటన్ ప్రధాని ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనన్నవేళ.. లిజ్ ట్రస్ పై భారత సంతతికి చెందిన రిషీ సునాక్ అనుహ్య విజయం సాధించారు. ఏంటి సెప్టెంబర్ 5న కదా తుది ఫలితం తేలేది..అప్పుడే రిషి సునాక్ విజయం ఏమిటనుకుంటున్నారా.. రిషీ సునాక్ విజయం సాధించింది ఎన్నికల సమరంలో కాదు. స్కైటీవీ నిర్వహించిన ఓ డిబేట్ లో.. ఈచర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు మాట్లాడిన తర్వాత ఓటింగ్ పెట్టడంతో స్టూడియోలో డిబేట్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఎక్కువమంది రిషీ సునాక్ కు మద్దతు తెలిపారు. స్కై న్యూస్ నిర్వహించిన ‘బ్యాటిల్ ఫర్ నంబర్ 10’ డిబేట్ లో రిషీ సునాక్, లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈఇద్దరు నేతలు టీవీ ప్రెజెంటర్ కే.బర్లీ నుంచి కష్టమైన ప్రశ్నలే ఎదుర్కొన్నారు. రిషీ సునాక్ ఎంతో సహనంగా ప్రశ్నలకు సమాధానమివ్వగా.. లిజ్ ట్రస్ మాత్రం బర్లీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కొంత అసహనం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఇద్దరు అభ్యర్థులు తెలిపారు. ఆతర్వాత రిషి సునాక్ మాట్లాడుతూ.. పన్నుల తగ్గింపు కంటే ముందు మోర్టగేజ్ రేట్లు పెరగకుండా ఉండేందుకు ద్రవ్యోల్పణాన్ని అదుపు చేయాల్పిన అవసరం ఉందన్నారు. ద్రవోల్పణం పెరిగితే ప్రజల పొదుపు, పింఛన్లు ఆవిరవుతాయని పేర్కొన్నారు. లిజ్ ట్రస్ మాట్లాడుతూ.. అధిక పన్నుల వల్లే బ్రిటన్ లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే భయం తతెత్తుతోందని దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవిషయంపై ఇద్దరు నేతల మధ్య బేధాభిప్రాయాలు స్పష్టంగా కన్పించాయి. గతంలో ఉద్యోగుల జీతాలు తగ్గించాలని లిజ్ ట్రస్ చేసిన వ్యాఖ్యలను ప్రెజెంటర్ గుర్తుచేయగా..తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందంటూ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఆమె. డిబేట్ పూర్తయిన తర్వాత రిషీకి మద్దతు ఇస్తున్నవారిని చేతులు ఎత్తమనగా స్టూడియో ఉన్న ప్రేక్షకుల్లో ఎక్కువ మంది స్పందిచారు. లిజ్ ట్రస్ కు మాత్రం నామమాత్రపు స్పందన లభించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. రిషీ సునాక్ కు ఎక్కువమంది ప్రేక్షకులు మద్దతుగా నిలుస్తారని తాను ఊహించలేదని ప్రజెంటర్ బర్లీ కూడా వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే బర్లీ రిషీ సునాక్ ను అతడి లైఫ్ స్టైల్ కు సంబధించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగ్గా..దానికి రిషీ సునాక్ ఆచీతూచీ సమాధానమిచ్చారు. రిషి సునాక్ మావయ్య అయిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నాగవర రామరావు నారాయణ మూర్తి బిలియనీర్ అనే ఉద్దేశంతో ఖరీదైన ప్రాడా షూస్ లో నడుస్తునన్ మీరు సాధారణ షూ ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తున్నారంటూ డిబేట్ లో ప్రెజంటర్ అడగ్గా.. తన తండ్రి జాతీయ ఆరోగ్య సేవ (ఎన్ హెచ్ ఎస్)లో వైద్యుడిగా పనిచేశారని..తాను పెరిగింది వైద్యరంగానికి చెందిన వ్యక్తి కుటుంబంలో అని అంటూనే తాను ఈవిషయాన్ని తన ప్రచారంలోనూ చెప్పానని గుర్తు చేశారు. అయితే ప్రధాని రేసులో మాత్రం లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు అనేక సర్వేల ఫలితాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువమంది లిజ్ ట్రస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీలో మాత్రం రిషీ సునాక్ కే ఎక్కువ మంది మద్దతు లభిస్తున్నట్లు పలు వార్తాసంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని ఎవరనే తుది ఫలితం సెప్టెంబర్ 5న తేలనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu