Cargo Container Missing Case: ఎయిర్‌ పోర్ట్‌లో బంగారంతో ఉన్న భారీ కార్గొ కంటైనర్‌ చోరీ.. నిందితుల్లో ఇద్దరు భారతీయులు!

|

Apr 19, 2024 | 10:20 AM

గతేడాది కెనాడాలోని టొరంటో ఎయిర్‌పోర్ట్ జరిగిన అతిపెద్ద బంగారం దోపిడీ కేసులో ఆరుగురు వ్యక్తులను అక్కడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారంతో ఉన్న కార్గో కంటెయినర్‌ను గత ఏడాది ఏప్రిల్ 17 (2023) టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొందరు దుండగులు మాయం చేశారు. కెనడా చరిత్రలోనే ఇదే అతిపెద్ద దోపిడీ..

Cargo Container Missing Case: ఎయిర్‌ పోర్ట్‌లో బంగారంతో ఉన్న భారీ కార్గొ కంటైనర్‌ చోరీ.. నిందితుల్లో ఇద్దరు భారతీయులు!
Canada Cargo Container Missing Case
Follow us on

ఒట్టావా, ఏప్రిల్‌ 19: గతేడాది కెనాడాలోని టొరంటో ఎయిర్‌పోర్ట్ జరిగిన అతిపెద్ద బంగారం దోపిడీ కేసులో ఆరుగురు వ్యక్తులను అక్కడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారంతో ఉన్న కార్గో కంటెయినర్‌ను గత ఏడాది ఏప్రిల్ 17 (2023) టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొందరు దుండగులు మాయం చేశారు. కెనడా చరిత్రలోనే ఇదే అతిపెద్ద దోపిడీ కేసుగా అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొటున్నాయి. దొంగిలించిన కార్గో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి ఎయిర్ కెనడా విమానంలో కంటైనర్‌ అక్కడికి వచ్చింది. అయితే నకిలీ డాక్యుమెంట్లు చూపించి దుండగులు దానిని ఎత్తుకెళ్తారు.

ఈ చోరీకి ఇద్దరు మాజీ ఎయిర్ కెనడా ఉద్యోగులు సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే సదరు ఉద్యోగి అరెస్ట్‌కు ముందే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరొకరిని కంపెనీ సస్పెండ్‌ చేయగా అతనిపై పోలీసులు వారెంట్‌ జారీ చేశారు. బుధవారం అరెస్టయిన వారిలో భారత సంతతికి చెందిన పర్మ్‌పాల్ సిద్ధు (54), అమిత్ జలోటా (40), అంటారియో నివాసి, అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసాత్ పరమలింగం (35).. ఆరుగురిని పీల్ రీజినల్ పోలీసులు (PRP) ) అరెస్ట్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (31), అర్చిత్ గ్రోవర్ (36), అర్సలాన్ చౌదరి (42) ఈ ముగ్గురికీ పీల్ పోలీసులు వారెంట్లు జారీ చేశారు.

దొంగిలించిన కంటైనర్‌లో 20 మిలియన్‌ కెడియన్ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విలువైన విదేశీ నగదు ఉందని అధికారులు వెల్లడించారు. కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో దుండగులు మాయం చేశారు. ఇది జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. కెనడా ఎయిర్‌పోర్టులో ఇంత భారీ చోరీ జరగడం ఇదే తొలిసారి కాదు. 1952లో టొరంటో ఎయిర్‌పోర్టులో 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారం చోరీకి గురికాగా.. ఈ కేసు ఇప్పటికీ విచారణలోనే ఉంది. ఇక 1974లో అట్టావా విమానాశ్రయంలో 4.6 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని ఓ గార్డు తుపాకీతో బెదిరించి దొంగిలించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.