
ఆదివారం సాయంత్రం ఉత్తర జపాన్‌ను భారీ భూకంప వణికించింది. 6.7 తీవ్రతతో భూకంపం తాకింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు, ఆ ప్రాంతంలోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే వాటికి ఎలాంటి నష్టం కానీ, పనిచేయకపోవడం గురించి కానీ ఎటువంటి సమాచారం అందలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
భూకంపం వచ్చిన వెంటనే, ఉత్తర తీరప్రాంతాలను 1 మీటర్ (3 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. భూకంపం వచ్చిన గంట తర్వాత కూడా ఈ హెచ్చరిక అమలులో ఉంది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రజలు తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. NHK కూడా ఈ ప్రాంతాన్ని మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది.
ఇవాటే ప్రిఫెక్చర్‌లోని ఒఫునాటో నగరం, ఒమినాటో ఓడరేవులో దాదాపు 10 సెంటీమీటర్ల (4 అంగుళాల) ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయని NHK పేర్కొంది. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో నడుస్తున్న బుల్లెట్ రైళ్లు కొద్దిసేపు ఆలస్యం అయ్యాయని రైల్వే ఆపరేటర్ JR ఈస్ట్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది.
A magnitude 6.2 earthquake struck off the east coast of Honshu, Japan at 17:03 local time on November 9, 2025. #地震 #sismo
The epicenter was 112 km east of Miyako. Tsunami evaluation is in progress; alerts may follow for coastal areas in Japan. pic.twitter.com/5movhhr96P
— GeoTechWar (@geotechwar) November 9, 2025
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఈ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. దీని వలన తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 2011 మార్చిలో ఇదే ప్రాంతంలో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఆ సమయం వచ్చిన సునామీ జపాన్‌ను అతలాకుతలం చేసింది. దీనివల్ల వేలాది మంది మరణించారు. విస్తృత విధ్వంసం సంభవించింది. ఈసారి పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేనప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
A M6.8 earthquake hit off the east coast of Honshu, Japan about 1hr 40mins ago pic.twitter.com/z5U74CErk9
— Pesquisador ! ☄️🪐🗿 (@ospensadorestt) November 9, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..